సరపట్లపల్లె వద్ద హెరిటేజ్ చిల్లింగ్ సెంటర్
ABN , Publish Date - Sep 26 , 2025 | 01:44 AM
గంగవరం మండలం సరపట్లపల్లె వద్ద హెరిటేజ్ ఫుడ్స్ ఆధ్వర్యంలో నూతన చిల్లింగ్ సెంటర్‌ను కంపెనీ ఎండీ నారా భువనేశ్వరి ప్రారంభించారు.
100శాతం మహిళలే పనిచేస్తారన్న నారా భువనేశ్వరి
గంగవరం, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): గంగవరం మండలం సరపట్లపల్లె వద్ద హెరిటేజ్ ఫుడ్స్ ఆధ్వర్యంలో నూతన చిల్లింగ్ సెంటర్‌ను కంపెనీ ఎండీ నారా భువనేశ్వరి ప్రారంభించారు.హెరిటేజ్ ద్వారా దేశవ్యాప్తంగా రోజూ 18 లక్షల లీటర్ల పాలను సేకరిస్తున్నామన్న ఆమె ఈ చిల్లింగ్ సెంటర్‌లో మహిళా సాధికారతకు పెద్దపాట వేశామన్నారు. 100శాతం మహిళలే పనిచేయడానికి అవకాశం కల్పిస్తున్నామన్నారు.మొదట 30 గ్రామాల్లో పాలను సేకరించి, త్వరలోనే 60 గ్రామాలకు విస్తరింపజేయడానికి కృషి చేస్తామన్నారు.హెరిటేజ్ ద్వారా ఉచిత బీమా, పశు బీమా సేవలు, ఉచిత పశువైద్య శిబిరాలు, పశు దాణా సరఫరా, రుణ సహాయం తదితర సేవలను రైతులకు అందిస్తున్నామన్నారు.హెరిటేజ్ అధికారులు రామ్మోహన్‌బాబు, గోపాలకృష్ణన్, బానోత్ శ్రీను, సర్వోత్తమ రెడ్డి, హరిబాబు, ఆదినారాయణ, లక్ష్మీరెడ్డి తదితరులు పాల్గొన్నారు.