Share News

మ్యానిఫెస్టోలో లేకున్నా ఆటోడ్రైవర్లకు సాయం

ABN , Publish Date - Oct 05 , 2025 | 01:01 AM

తమ ప్రభుత్వంలో ఆటో డ్రైవర్లంతా సంతోషంగా ఉన్నారని జిల్లా ఇన్చార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్‌ పేర్కొన్నారు. గత ప్రభుత్వం తరహాలో వీరికి ఎలాంటి వేధింపులూ లేవన్నారు. రోడ్‌ టాక్స్‌, గ్రీన్‌ టాక్స్‌లూ లేవన్నారు. కార్మికుల, కర్షకుల పక్షాన తమ ప్రభుత్వం సుపరిపాలన సాగిస్తోందన్నారు. శనివారం తిరుపతిలోని కచ్చపి ఆడిటోరియంలో నిర్వహించిన ‘ఆటో డైవ్రర్ల సేవలో..’ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిఽథిగా పాల్గొన్నారు.

మ్యానిఫెస్టోలో లేకున్నా ఆటోడ్రైవర్లకు సాయం
లబ్ధిదారులకు చెక్కు అందజేస్తున్న మంత్రి అనగాని సత్యప్రసాద్‌, కలెక్టర్‌ వెంకటేశ్వర్‌

‘ఆటో డ్రైవర్ల సేవలో..’ మంత్రి అనగాని

జిల్లాలో 14,375కి రూ.2,1.56 కోట్ల జమ

తిరుపతి, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి) : తమ ప్రభుత్వంలో ఆటో డ్రైవర్లంతా సంతోషంగా ఉన్నారని జిల్లా ఇన్చార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్‌ పేర్కొన్నారు. గత ప్రభుత్వం తరహాలో వీరికి ఎలాంటి వేధింపులూ లేవన్నారు. రోడ్‌ టాక్స్‌, గ్రీన్‌ టాక్స్‌లూ లేవన్నారు. కార్మికుల, కర్షకుల పక్షాన తమ ప్రభుత్వం సుపరిపాలన సాగిస్తోందన్నారు. శనివారం తిరుపతిలోని కచ్చపి ఆడిటోరియంలో నిర్వహించిన ‘ఆటో డైవ్రర్ల సేవలో..’ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిఽథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ మ్యానిఫెస్టోలో ప్రస్తావించకున్నా ఆటో డ్రైవర్లకు రూ.15వేలు చొప్పునఅందిస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 16 నెలల్లోనే 16 పథకాలను అమలు చేస్తోందన్నారు. అటో డ్రైవర్‌ సేవలో పథకం కింద జిల్లా వ్యాప్తంగా 14375మంది ఆటో యజమానులకు రూ21.56 కోట్ల మెగా చెక్కును మంత్రి లబ్ధిదారులకు అందించారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన స్థానిక ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం .పవన్‌ కల్యాణ్‌, మంత్రి లోకేష్‌లు రాష్ట్రాభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా సహకారం అందిస్తోందన్నారు. ఆటో డ్రైవర్లకు ఇబ్బందులు ఎదురైతే తీర్చడానికి తమవంతు సహకారం అందిస్తామన్నారు. కలెక్టర్‌ డాక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వర్‌ మాట్లాడుతూ ఆటో డ్రైవర్ల సంక్షేమం పట్ల రాష్ట్ర ప్రభుత్వం చూపుతున్న శ్రద్ధతో వారి కుటుంబాలు భద్రంగా ఉంటాయన్నారు. ఆటోడ్రైవర్ల నడవడిక, ఆరోగ్యానికి సంబంధించి ఆయన పలు సూచనలు చేశారు.

వరుసగా ఫలితాలు..

ఏపీజీబీసీ ఛైర్మన్‌ సుగుణమ్మ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కృషి ఫలితాలు ఒక్కొక్కటిగా అందుతున్నాయన్నారు. రాష్ట్ర యాదవ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ నరసింహ యాదవ్‌ మాట్లాడుతూ ఈ పథకం ఆటోడ్రైవర్ల జీవితాలలో వెలుగులు నింపుతుందన్నారు. నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్‌ ఆర్సీ మునికృష్ణ, రాష్ట్ర హస్తకళల అభివృద్ధి చైర్మన్‌ డాక్టర్‌ పసుపులేటి హరిప్రసాద్‌, నాయీ బ్రాహ్మణ చైర్మన్‌ రుద్రకోటి సదాశివం మాట్లాడుతూ ఒడిదుడుకులు ఎదురైనా కూటమి ప్రభుత్వం సంక్షేమాభివృద్ధి కార్యక్రమాల అమలుకు కృషి చేస్తోందన్నారు. రీజనల్‌ జాయింట్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌ బి.కృష్ణవేణి మాట్లాడుతూ అర్హులుంటే ఈ పథకం వర్తింపచేస్తామన్నారు. అనంతరం ఆటోడ్రైవర్లు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్‌ మౌర్య, ట్రైనీ కలెక్టర్‌ సందీప్‌, ఆర్టీవో మురళీమోహన్‌, ఎస్సీ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ కుమారి, ఎంవీఐలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 05 , 2025 | 01:01 AM