హలో.. ఐయామ్ రోడ్ డాక్టర్
ABN , Publish Date - Sep 11 , 2025 | 01:33 AM
రోడ్లపై ఏర్పడిన గుంతలను పూడ్చాలంటే ఇకపై మనుషులతో పనిలేదు. ‘రోడ్ డాక్టర్’ పేరిట తిరుపతి నగరపాలక సంస్థకు వచ్చిన ఓ వాహన యంత్రం నిమిషాల్లో గుంతలను పూడ్చేస్తోంది.
రోడ్లపై ఏర్పడిన గుంతలను పూడ్చాలంటే ఇకపై మనుషులతో పనిలేదు. ‘రోడ్ డాక్టర్’ పేరిట తిరుపతి నగరపాలక సంస్థకు వచ్చిన ఓ వాహన యంత్రం నిమిషాల్లో గుంతలను పూడ్చేస్తోంది. బుధవారం నగరంలోని పలు రోడ్లపై ఏర్పడిన గుంతలను ఈ యంత్రం సాయంతో పూడ్చారు. ఈ యంత్రం పనితీరును కమిషనర్ ఎన్.మౌర్య పరిశీలించారు. దీనిని సుమారు రూ1.5 కోట్లతో కొన్నామన్నారు. నూతన టెక్నాలజీతో సిద్ధం చేసిన రోడ్ల డాక్టర్ యంత్రం ద్వారా ఎప్పటికప్పుడు గుంతలను పూడ్చేందుకు అవకాశం ఉందన్నారు. సీసీ రోడ్లు, తారు రోడ్లు పూడ్చేందుకు దీనిని వినియోగిస్తారన్నారు.
- తిరుపతి, ఆంధ్రజ్యోతి