మరో ఐదు రోజులూ భారీ వర్షాలు
ABN , Publish Date - Oct 25 , 2025 | 01:16 AM
జిల్లాలో మరో ఐదు రోజులు భారీ వర్షాలు ఉన్నాయని కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండి ప్రాణ, ఆస్తి నష్టం కలగకుండా చర్యలు చేపట్టాలని శుక్రవారం ఆదేశించారు. ఈ నెల 27 నుంచి మూడు రోజుల పాటు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దన్నారు. నీటి ప్రవాహాల వద్దకు పిల్లలను వెళ్లకుండా చూడాలన్నారు. సముద్ర తీర ప్రాంతాల్లో 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందన్నారు. రాబోయే మూడు రోజులపాటు మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని ఆయన సూచించారు. కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజలు ఎలాంటి ప్రమాద స్థితిలోనైనా 0877-2236007లో సంప్రదించవచ్చన్నారు.
మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దు
అధికారులు అప్రమత్తంగా ఉండాలన్న కలెక్టర్
తిరుపతి(కలెక్టరేట్), అక్టోబరు 24(ఆంధ్రజ్యోతి): జిల్లాలో మరో ఐదు రోజులు భారీ వర్షాలు ఉన్నాయని కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండి ప్రాణ, ఆస్తి నష్టం కలగకుండా చర్యలు చేపట్టాలని శుక్రవారం ఆదేశించారు. ఈ నెల 27 నుంచి మూడు రోజుల పాటు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దన్నారు. నీటి ప్రవాహాల వద్దకు పిల్లలను వెళ్లకుండా చూడాలన్నారు. సముద్ర తీర ప్రాంతాల్లో 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందన్నారు. రాబోయే మూడు రోజులపాటు మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని ఆయన సూచించారు. కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజలు ఎలాంటి ప్రమాద స్థితిలోనైనా 0877-2236007లో సంప్రదించవచ్చన్నారు.
వర్షపాతం ఇలా: శుక్రవారం ఉదయం 8.30గంటల వరకు నమోదైన వర్షపాతం వివరాలు.. అత్యధికంగా కేవీబీపురం 83 మి.మీ. వాన పడింది. ఏర్పేడు, బీఎన్‌కండ్రిగ 71.8, పెళ్లకూరు 66.6, సూళ్లూరుపేట 64.8, ఎర్రావారిపాళెం 60.8, వడమాలపేట 55.8, రేణిగుంట 55.6, వరదయ్యపాళెం 51.4, పిచ్చాటూరు 50.6, నాగలాపురం 45.4, నారాయణవనం 41.8, సత్యవేడు 38.2, చంద్రగిరి 34.8, చిన్నగొట్టిగల్లు 34.4, తిరుపతి అర్బన్ 32.2, తడ 30.4, శ్రీకాళహస్తి 29.8, నాయుడుపేట 29.4, దొరవారిసత్రం 28.6మి.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. మరో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో సెలవుల్లో ఉన్న అధికారులు, ఉద్యోగులు రద్దు చేసుకుని విధుల్లో చేరాలని కలెక్టర్ ఆదేశించారు.