Share News

చిత్తూరు జిల్లాాలో పలు మండలాల్లో భారీ వర్షం

ABN , Publish Date - Nov 19 , 2025 | 12:25 AM

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో జిల్లావ్యాప్తంగా 25 మండలాల్లో గడిచిన 24 గంటల్లో తేలికపాటి నుంచి భారీ వర్షం కురిసింది.

చిత్తూరు జిల్లాాలో పలు మండలాల్లో భారీ వర్షం

చిత్తూరు కలెక్టరేట్‌, నవంబరు 18(ఆంధ్రజ్యోతి): నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో జిల్లావ్యాప్తంగా 25 మండలాల్లో గడిచిన 24 గంటల్లో తేలికపాటి నుంచి భారీ వర్షం కురిసింది. అత్యఽధికంగా నిండ్రలో 74.2, అత్యల్పంగా గుడిపాలలో 1 మిమీ వర్షం కురిసింది. మండలాల వారీగా కార్వేటినగరంలో 55.2,నగరిలో 39.6, వెదురుకుప్పంలో 39.4, పెనుమూరులో 28.2, ఎస్‌ఆర్‌పురంలో 25.2, పూతలపట్టులో 24.2, ఐరాలలో 15,2, బంగారుపాళ్యంలో 12.8, పలమనేరులో 9.2, గంగవరంలో 8.6, గంగాధరనెల్లూరులో 7.4, విజయపురంలో 7.2, చిత్తూరు అర్బన్‌లో 5.6, తవణంపల్లెలో 4.6, సదుం, పుంగనూరు, పెద్దపంజాణి మండలాల్లో 4.2, చౌడేపల్లెలో 3.4, యాదమరిలో 2.6, సోమలలో 2.2, పులిచెర్లలో 2, చిత్తూరు రూరల్‌లో 1.4, రొంపిచెర్లలో 1.2 మిమీ వర్షపాతం నమోదైంది.

Updated Date - Nov 19 , 2025 | 12:25 AM