దంచేసిన వాన
ABN , Publish Date - Aug 24 , 2025 | 02:00 AM
అల్పపీడన ద్రోణి ప్రభావ కారణంగా ఐదు మండలాల మినహా మిగిలిన 27 మండలాల్లో గడిచిన 24 గంటల్లో వర్షం దంచేసింది. పాలసముద్రంలో అత్యధికంగా 95.2 మి.మీ, అత్యల్పంగా సదుంలో 3.2 మి.మీ వర్షపాతం నమోదయ్యింది.
చిత్తూరు కలెక్టరేట్, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): అల్పపీడన ద్రోణి ప్రభావ కారణంగా ఐదు మండలాల మినహా మిగిలిన 27 మండలాల్లో గడిచిన 24 గంటల్లో వర్షం దంచేసింది. పాలసముద్రంలో అత్యధికంగా 95.2 మి.మీ, అత్యల్పంగా సదుంలో 3.2 మి.మీ వర్షపాతం నమోదయ్యింది. మండలాలవారీగా.. గుడిపాలలో 89.2, యాదమరిలో 87.4, గంగవరంలో 83.2, గుడుపల్లెలో 68.4, శాంతిపురంలో 54.6, కుప్పంలో 54, వి.కోటలో 50.6, చిత్తూరు రూరల్‌లో 43, బైరెడ్డిపల్లెలో 41.8, నగరిలో 41.2, విజయపురంలో 40.2, చిత్తూరు అర్బన్‌లో 35.6, బంగారుపాళ్యంలో 35, నిండ్రలో 31.4, రామకుప్పంలో 30.8, వెదురుకుప్పంలో 28.2, పలమనేరులో 25.8, పెద్దపంజాణిలో 25.4, పెనుమూరులో 20.2, కార్వేటినగరంలో 19.4, గంగాధరనెల్లూరులో 17, పూతలపట్టులో 16.4, శ్రీరంగరాజపురంలో 15.2, తవణంపల్లెలో 12.8, సోమలలో 4.8 మి.మీ వర్షం కురిసింది.