‘యోగా’తో ఆరోగ్యం
ABN , Publish Date - May 22 , 2025 | 02:13 AM
యోగాను దైనందిన జీవితంలో భాగం చేసుకుంటే మానసిక, శారీరక ఆరోగ్యానికి దోహదపడుతుందని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ హర్షవర్ధన్‌రాజు అన్నారు.
తిరుపతి(విశ్వవిద్యాలయాలు/క్రీడలు), మే 21 (ఆంధ్రజ్యోతి): యోగాను దైనందిన జీవితంలో భాగం చేసుకుంటే మానసిక, శారీరక ఆరోగ్యానికి దోహదపడుతుందని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ హర్షవర్ధన్‌రాజు అన్నారు. యోగాంధ్ర-2025 కార్యక్రమంలో భాగంగా పద్మావతి మహిళా యూనివర్సిటీలోని మల్టీపర్పస్ ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో బుధవారం ఉదయం యోగా కార్యక్రమాన్ని ప్రారంభించారు. యోగా మాస్టర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులతో కలసి 45 నిమిషాలు యోగాసనాలు వేశారు. యోగాకు గంట సమయం కేటాయిస్తే అనారోగ్యానికి దూరంగా ఉండొచ్చన్నారు. దీనిపై అధికారులు విస్తృత ప్రచారం ప్రచారం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహయాదవ్, గ్రీనరీ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్‌పర్సన్ సుగుణమ్మ, డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణ, మహిళా వర్సిటీ వీసీ ఉమా, రిజిస్ట్రార్ రజని, డీఆర్వో నరసింహులు, కార్పొరేషన్ అదనపు కమిషనర్ చరణ్‌తేజ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.