పాము భయంతో ప్రాణం పోగొట్టుకున్నాడు!
ABN , Publish Date - Dec 25 , 2025 | 01:44 AM
పాము భయంతో మిద్దెపైకి వెళ్తే విద్యుత్ వైర్లు తగిలి ఓ వ్యక్తి కిందపడి మృతి చెందాడు. బాధితుల కథనం ప్రకారం... పెద్దపంజాణి మండలం అప్పినపల్లెకు చెందిన వాసు(45) బుధవారం చదళ్ల సమీపంలోని పొలాల్లో ఉన్న ఓ ఇంటికి వెళ్లాడు.
పుంగనూరు రూరల్, డిసెంబరు24(ఆంధ్రజ్యోతి): పాము భయంతో మిద్దెపైకి వెళ్తే విద్యుత్ వైర్లు తగిలి ఓ వ్యక్తి కిందపడి మృతి చెందాడు. బాధితుల కథనం ప్రకారం... పెద్దపంజాణి మండలం అప్పినపల్లెకు చెందిన వాసు(45) బుధవారం చదళ్ల సమీపంలోని పొలాల్లో ఉన్న ఓ ఇంటికి వెళ్లాడు. అదే సమయంలో పాము ఉందంటూ యజమాని ఇంటిపైకి వెళుతున్నట్లు వాసు గుర్తించాడు. అతను కూడా పరుగున మిద్దెపైకి వెళ్లాడు. ఈక్రమంలో ఇంటిపై ఉన్న విద్యుత్ వైర్లు తగిలి వాసు కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు పరిశీలించి మృతి చెందినట్లు నిర్ధారించారు. సీఐ సుబ్బరాయుడు వెళ్లి ప్రమాదంపై ఆరా తీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు తెలిపారు.