Share News

స్వచ్ఛ అవార్డుల పంట

ABN , Publish Date - Oct 04 , 2025 | 02:26 AM

స్వచ్ఛాంధ్రలో చిత్తూరు జిల్లా మరో ముందడుగు వేసిందని కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ అన్నారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని రాష్ట్రప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛాంధ్ర అవార్డుల్లో జిల్లా మంచి స్థానాన్ని కైవసం చేసుకుంది.మొత్తం 16 విభాగాల్లో రాష్ట్రస్థాయిలో ఆరు అవార్డులను కైవసం చేసుకోగా, జిల్లాస్థాయిలో 48 అవార్డులను గెలుచుకుంది. కలెక్టరేట్‌లో గురువారం కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ మీడియాకు అవార్డుల వివరాలు వెల్లడించారు.అధికారులే కాకుండా శానిటరీ వారియర్స్‌, గ్రీన్‌ అంబాసిడర్స్‌ సైతం బాధ్యతగా పనిచేయడం వల్లే ఇన్ని స్వచ్ఛత అవార్డులు వచ్చాయన్నారు.అయితే గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్య సేవలు మరింత మెరుగుపడాలన్న ఆయన ప్రజలంతా కూడా ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ప్లాస్టిక్‌ లాంటి వ్యర్థాలను ఎక్కడపడితే అక్కడ వేయకుండా చెత్త కుండీల్లో వేసి శానిటరీ వారియర్స్‌కు సహకరించాలన్నారు. చాలా చోట్ల సిబ్బంది కొరత, వయస్సు పైబడిన వారు శానిటరీ వారియర్స్‌గా ఉన్న కారణంగా గ్రామ, మున్సిపాలిటీ సరిహద్దు ప్రాంతాల్లో చెత్త సేకరణ కొంత ఆలస్యమవుతోందన్నారు.కూడళ్లలో పాడైన చెత్త కుండీలు తొలగించి కొత్తవి ఏర్పాటు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని, శానిటరీ వారియర్స్‌ కొరతను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినట్లు చెప్పారు.సోమవారం రాష్ట్రస్థాయి అవార్డులను ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిలో అందజేస్తారని,అదేరోజున జిల్లా కేంద్రంలో నిర్వహించే కార్యక్రమంలో జిల్లా కేటగిరి అవార్డులు అందిస్తామని చెప్పారు.

స్వచ్ఛ అవార్డుల పంట
స్వచ్ఛాంధ్ర అవార్డుల ప్రకటనకు ముందు గాంధీ చిత్రపటానికి కలెక్టర్‌ నివాళి

  • రాష్ట్రస్థాయిలో ఆరు.. జిల్లాస్థాయిలో 48

  • ప్రజల్లోనూ స్వచ్ఛతపై బాధ్యత పెరగాలన్న కలెక్టర్‌

చిత్తూరు సెంట్రల్‌, అక్టోబరు 3(ఆంధ్రజ్యోతి): స్వచ్ఛాంధ్రలో చిత్తూరు జిల్లా మరో ముందడుగు వేసిందని కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ అన్నారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని రాష్ట్రప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛాంధ్ర అవార్డుల్లో జిల్లా మంచి స్థానాన్ని కైవసం చేసుకుంది.మొత్తం 16 విభాగాల్లో రాష్ట్రస్థాయిలో ఆరు అవార్డులను కైవసం చేసుకోగా, జిల్లాస్థాయిలో 48 అవార్డులను గెలుచుకుంది. కలెక్టరేట్‌లో గురువారం కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ మీడియాకు అవార్డుల వివరాలు వెల్లడించారు.అధికారులే కాకుండా శానిటరీ వారియర్స్‌, గ్రీన్‌ అంబాసిడర్స్‌ సైతం బాధ్యతగా పనిచేయడం వల్లే ఇన్ని స్వచ్ఛత అవార్డులు వచ్చాయన్నారు.అయితే గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్య సేవలు మరింత మెరుగుపడాలన్న ఆయన ప్రజలంతా కూడా ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ప్లాస్టిక్‌ లాంటి వ్యర్థాలను ఎక్కడపడితే అక్కడ వేయకుండా చెత్త కుండీల్లో వేసి శానిటరీ వారియర్స్‌కు సహకరించాలన్నారు. చాలా చోట్ల సిబ్బంది కొరత, వయస్సు పైబడిన వారు శానిటరీ వారియర్స్‌గా ఉన్న కారణంగా గ్రామ, మున్సిపాలిటీ సరిహద్దు ప్రాంతాల్లో చెత్త సేకరణ కొంత ఆలస్యమవుతోందన్నారు.కూడళ్లలో పాడైన చెత్త కుండీలు తొలగించి కొత్తవి ఏర్పాటు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని, శానిటరీ వారియర్స్‌ కొరతను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినట్లు చెప్పారు.సోమవారం రాష్ట్రస్థాయి అవార్డులను ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిలో అందజేస్తారని,అదేరోజున జిల్లా కేంద్రంలో నిర్వహించే కార్యక్రమంలో జిల్లా కేటగిరి అవార్డులు అందిస్తామని చెప్పారు.

Updated Date - Oct 04 , 2025 | 02:26 AM