గూడూరు నెల్లూరుకే తిరుపతికి రైల్వే కోడూరు!
ABN , Publish Date - Dec 28 , 2025 | 02:21 AM
జిల్లా పునర్విభజన ప్రక్రియలో మళ్లీ మార్పుచేర్పులు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈనెల 31న తుది నోటిఫికేషన్ జారీ అవుతుందన్న ప్రచారం నేపధ్యంలో తాజాగా ప్రభుత్వం మరోసారి మార్పుచేర్పులపై తుది కసరత్తు చేపట్టింది. గూడూరు నియోజకవర్గాన్ని తిరిగి నెల్లూరు జిల్లాలో విలీనం చేసే ప్రతిపాదనకు సీఎం సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. దానికి ప్రతిగా అన్నమయ్య జిల్లా నుంచీ రైల్వే కోడూరును తిరుపతిలో చేర్చే అవకాశమున్నట్టు తెలిసింది. గూడూరు నుంచి తిరుపతికి 97 కిలోమీటర్లు. అదే నెల్లూరు కేవలం 43 కిలోమీటర్లే. భౌగోళిక సామీప్యతతో పాటు గూడూరు ప్రాంత ప్రజలకు నెల్లూరుతో అనుబంధం ఉంది. దానికి తోడు ఎన్నికలకు ముందు చంద్రబాబు, నారా లోకేశ్ అక్కడి ప్రజలకు స్పష్టమైన హామీలు కూడా ఇచ్చారు. ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేశాక 20 రోజులుగా గూడూరు నియోజకవర్గంలో ఆందోళనలు కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గూడూరును నెల్లూరు జిల్లాలో విలీనం చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించినట్టు సమాచారం. అలాగే, గూడూరును కోల్పోతున్న క్రమంలో దానికి ప్రతిగా అన్నమయ్య జిల్లా నుంచి రైల్వే కోడూరు నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లాలో కలపాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నట్టు సమాచారం. రైల్వే కోడూరు నుంచీ ప్రస్తుత జిల్లా కేంద్రం రాయచోటికి 93 కిలోమీటర్లు. అదే తిరుపతి 52 కిలోమీటర్లే. అక్కడి ప్రజలూ తమ ప్రాంతాన్ని తిరుపతి జిల్లాలో కలపాలని కోరుతున్నారు. వీటిని దృష్టిలో ఉంచుకుని కోడూరు నియోజకవర్గాన్ని తిరుపతిలో కలపాలని సీఎం నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఈ రెండింటిపై ఒకట్రెండు రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడుతుందని సమాచారం.
వెంకటగిరి.. మూడు మండలాల చేరికపై అస్పష్టత
నగరి.. మూడు మండలాల గురించి లేని ప్రస్తావన
తిరుపతి, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): జిల్లా పునర్విభజన ప్రక్రియలో మళ్లీ మార్పుచేర్పులు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈనెల 31న తుది నోటిఫికేషన్ జారీ అవుతుందన్న ప్రచారం నేపధ్యంలో తాజాగా ప్రభుత్వం మరోసారి మార్పుచేర్పులపై తుది కసరత్తు చేపట్టింది. గూడూరు నియోజకవర్గాన్ని తిరిగి నెల్లూరు జిల్లాలో విలీనం చేసే ప్రతిపాదనకు సీఎం సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. దానికి ప్రతిగా అన్నమయ్య జిల్లా నుంచీ రైల్వే కోడూరును తిరుపతిలో చేర్చే అవకాశమున్నట్టు తెలిసింది. గూడూరు నుంచి తిరుపతికి 97 కిలోమీటర్లు. అదే నెల్లూరు కేవలం 43 కిలోమీటర్లే. భౌగోళిక సామీప్యతతో పాటు గూడూరు ప్రాంత ప్రజలకు నెల్లూరుతో అనుబంధం ఉంది. దానికి తోడు ఎన్నికలకు ముందు చంద్రబాబు, నారా లోకేశ్ అక్కడి ప్రజలకు స్పష్టమైన హామీలు కూడా ఇచ్చారు. ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేశాక 20 రోజులుగా గూడూరు నియోజకవర్గంలో ఆందోళనలు కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గూడూరును నెల్లూరు జిల్లాలో విలీనం చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించినట్టు సమాచారం. అలాగే, గూడూరును కోల్పోతున్న క్రమంలో దానికి ప్రతిగా అన్నమయ్య జిల్లా నుంచి రైల్వే కోడూరు నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లాలో కలపాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నట్టు సమాచారం. రైల్వే కోడూరు నుంచీ ప్రస్తుత జిల్లా కేంద్రం రాయచోటికి 93 కిలోమీటర్లు. అదే తిరుపతి 52 కిలోమీటర్లే. అక్కడి ప్రజలూ తమ ప్రాంతాన్ని తిరుపతి జిల్లాలో కలపాలని కోరుతున్నారు. వీటిని దృష్టిలో ఉంచుకుని కోడూరు నియోజకవర్గాన్ని తిరుపతిలో కలపాలని సీఎం నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఈ రెండింటిపై ఒకట్రెండు రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడుతుందని సమాచారం.
వెంకటగిరి మండలాలపై డోలాయమానం
వెంకటగిరి నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో కలువాయి, సైదాపురం, రాపూరు మండలాలు నెల్లూరు జిల్లాలో ఉన్నాయి. వాటిని తిరుపతిలో కలిపేలా ప్రాథమిక నోటిఫికేషన్ ఇప్పటికే జారీ అయింది. అయితే ఫైనల్ నోటిఫికేషన్ జారీ చేయనున్న దశలో మళ్ళీ ప్రభుత్వం దీనిపై పునరాలోచనలో పడినట్టు సమాచారం. ఇప్పటికైతే సైదాపురాన్ని తిరుపతిలో కలపాలని.. కలువాయిని నెల్లూరులోనే కొనసాగించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. రాపూరు విషయంలో కాస్త అటూ ఇటూగా వున్నప్పటికీ అంతిమంగా తిరుపతిలో కలిపేందుకే ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. కలువాయి తిరుపతికి భౌగోళికంగా చాలా దూరంలో వున్నందున దాన్ని నెల్లూరులోనే కొనసాగించే అవకాశం ఉంది.
ప్రస్తావన లేని నగరి
తుది దశలో మార్పుచేర్పులపై కసరత్తు నడుస్తున్న నేపధ్యంలో నగరి నియోజకవర్గ మండలాలపైనా నిర్ణయం ఉంటుందని అక్కడి ప్రజలు ఆశిస్తున్నారు. అయితే ప్రభుత్వ పరిశీలనలో మాత్రం నగరి ప్రస్తావన లేదని తెలిసింది. నగరి, నిండ్ర, విజయపురం మండలాలు చిత్తూరులో కాకుండా తిరుపతిలో కలపాలని అటు ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్, ఇటు ప్రజలూ కోరుకుంటున్నారు. క్యాబినెట్ సబ్ కమిటీకి, ప్రభుత్వానికి కూడా పెద్ద ఎత్తున అభ్యర్థనలు అందాయి. కానీ ప్రాధమిక నోటిఫికేషన్‌లో నగరి ప్రస్తావన లేదు. ఇపుడు తుది నోటిఫికేషన్‌లో కూడా నగరి అంశం ఉండకపోవచ్చని తెలుస్తోంది.
రైల్వే కోడూరు విలీన ప్రతిపాదన ఏనాటిదో?
ఉమ్మడి కడప జిల్లాకు చెందిన రైల్వే కోడూరు నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లాలో విలీనం చేయాలన్న ప్రతిపాదన ఈనాటిది కాదు. మూడు దశాబ్దాల కిందటే ప్రముఖంగా ప్రచారంలోకి వచ్చింది. 1989-94 నడుమ కాంగ్రెస్ పాలనలో జిల్లాల పునర్విభజనకు ప్రయత్నాలు జరిగాయి. నేదురుమల్లి జనార్దనరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు జోరుగా సాగిన ప్రయత్నాల్లో తిరుపతి కేంద్రంగా బాలాజీ జిల్లా ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఆ సందర్భంలో తిరుపతికి చేరువలో ఉన్న తమ నియోజకవర్గాన్ని బాలాజీ జిల్లాలో విలీనం చేయాలని అక్కడి ప్రజలు డిమాండ్ చేశారు. మరోవైపు చదువులు, వైద్యం, వస్తువుల కొనుగోళ్లకూ ఆ ప్రాంత వాసులు తిరుపతికే ఎక్కువగా వస్తుంటారు. అక్కడివారు ఎక్కువ మంది తిరుపతిలో స్థిరపడ్డారు. వ్యాపారాలూ సాగిస్తున్నారు. ఆ నియోజకవర్గ ముఖ్య నాయకులెందరో తిరుపతిలో నివాసం ఉంటున్నారు. దీంతో ఇటు కలిసేందుకు ఆసక్తి చూపారు. అయితే నేదురుమల్లి ప్రభుత్వ హయాంలో బాలాజీ జిల్లా ప్రతిపాదన కార్యరూపం దాల్చకున్నా ప్రజల ఆకాంక్ష మాత్రం అలాగే ఉంది. 2022లో వైసీపీ ప్రభుత్వం తిరుపతి జిల్లా ఏర్పాటు చేసిన సమయంలోనూ తిరుపతిలో కలపాలన్న డిమాండ్ వినిపించింది. అప్పుడూ కార్యరూపం దాల్చలేదు. తాజాగా జిల్లాల పునర్విభజన ప్రక్రియ తుదిదశలో హఠాత్తుగా హఠాత్తుగా కోడూరును తిరుపతిలో కలిపే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. దీంతో మరోసారి రైల్వే కోడూరు విలీన అంశం చర్చనీయాంశంగా మారింది. మరో రెండు రోజుల్లో దీనిపై స్పష్టత రానున్నట్లు సమాచారం.