Share News

దుగరాజపట్నంలో గ్రీన్‌ఫీల్డ్‌ పోర్టు

ABN , Publish Date - Dec 30 , 2025 | 01:23 AM

అమరావతిలో సోమవారం జరిగిన మంత్రి వర్గ సమావేశంలో జిల్లాకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వాకాడు, చిట్టమూరు మండలాల పరిధిలో దుగరాజపట్నం పోర్టు ఏర్పాటుచేయడానికి, అక్కడే షిప్‌ బిల్డింగ్‌ క్లస్టర్‌ ఏర్పాటు చేయడానికి ఏపీ మారిటైమ్‌ బోర్డు అవసరమైన చర్యలు తీసుకునేందుకు అనుమతిచ్చింది.

దుగరాజపట్నంలో గ్రీన్‌ఫీల్డ్‌ పోర్టు

మంత్రి వర్గ సమావేశంలో పలు నిర్ణయాలకు ఆమోదం

తిరుపతి, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): అమరావతిలో సోమవారం జరిగిన మంత్రి వర్గ సమావేశంలో జిల్లాకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వాకాడు, చిట్టమూరు మండలాల పరిధిలో దుగరాజపట్నం పోర్టు ఏర్పాటుచేయడానికి, అక్కడే షిప్‌ బిల్డింగ్‌ క్లస్టర్‌ ఏర్పాటు చేయడానికి ఏపీ మారిటైమ్‌ బోర్డు అవసరమైన చర్యలు తీసుకునేందుకు అనుమతిచ్చింది. కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్‌, జలమార్గాల మంత్రిత్వశాఖకు చెందిన షిప్‌ బిల్డింగ్‌ స్కీం కింద వీటిని ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోనున్నారు.

ఫ తిరుపతిరూరల్‌ మండలం దామినేడులో 28.37ఎకరాల ప్రభుత్వ భూమిని శాప్‌కు ఉచితంగా కేటాయింపు.

ఫ తిరుపతి రూరల్‌ పేరూరులో ఏపీ టూరిజం అథారిటీ 2024ఫిబ్రవరి 14న ఫైవ్‌స్టార్‌ లగ్జరీ హోటల్‌ నిర్మించేందుకు ఎంఆర్కేఆర్‌ కన్‌స్ట్రక్షన్‌ అండ్‌ ఇండస్ర్టీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థకు భూమి కేటాయిస్తూ కుదుర్చుకున్న ఒప్పందం రద్దు.

ఫ తిరుపతి అర్బన్‌ శెట్టిపల్లెలో తుడాల్యాండ్‌ పూలింగ్‌ స్కీం కింద లబ్ధిదారులకు స్థలాలు కేటాయింపులో స్టాంప్‌ డ్యూటీ నియమిస్తూ నిర్ణయం.

ఫ తడ, దొరవారిసత్రం మండలాల్లో కాళంగి నదికి ఎడమవైపు 26 కిలోమీటర్ల మేరా తనియాలి ఆనకట్ట నుంచి సముద్రంలో కలిసే వరకు వరదకట్ట నిర్మాణ పనులను 2009లో చెన్నైకి చెందిన సంస్థ కాంట్రాక్ట్‌ తీసుకుంది. ఇప్పటికీ పూర్తి చేయకపోవడంతో రద్దుకు నిర్ణయం.

Updated Date - Dec 30 , 2025 | 01:23 AM