Share News

టీటీడీ ఐటీలో 34 పోస్టుల భర్తీకి గ్రీన్‌ సిగ్నల్‌

ABN , Publish Date - Dec 22 , 2025 | 02:14 AM

ఐటీ విభాగాన్ని పటిష్టం చేసేందుకు టీటీడీ సిద్ధవుతోంది. ఇందులో భాగంగా 34 పోస్టుల భర్తీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా భర్తీ చేయనున్న ఈ పోస్టులకు సంబంధించి ఐఐటీ తిరుపతి, ఏపీ ఆన్‌లైన్‌ సంస్థలతో ఏంఓయూ కుదుర్చుకోవాలని టీటీడీ బోర్డు కూడా నిర్ణయం తీసుకుంది.

టీటీడీ ఐటీలో 34 పోస్టుల భర్తీకి గ్రీన్‌ సిగ్నల్‌

తిరుమల, డిసెంబరు 21(ఆంధ్రజ్యోతి): ఐటీ విభాగాన్ని పటిష్టం చేసేందుకు టీటీడీ సిద్ధవుతోంది. ఇందులో భాగంగా 34 పోస్టుల భర్తీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా భర్తీ చేయనున్న ఈ పోస్టులకు సంబంధించి ఐఐటీ తిరుపతి, ఏపీ ఆన్‌లైన్‌ సంస్థలతో ఏంఓయూ కుదుర్చుకోవాలని టీటీడీ బోర్డు కూడా నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ ఐటీ పోస్టును అప్‌గ్రేడ్‌ చేసి మరో జనరల్‌ మేనేజర్‌ ఐటీ పోస్టును క్రియేట్‌ చేశారు. మొత్తం 34 పోస్టుల్లో 23 డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా, 11 ప్రమోషన్‌కు కేటాయించారు. అత్యవసర అవసరాలను దృష్టిలో పెట్టుకుని 7 పోస్టులను వెంటనే భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల్లో అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌1, సీనియర్‌ ఐటీ ఇంజినీర్‌(సా్‌ఫ్టవేర్‌)1, సీనియర్‌ ఐటీ ఇంజినీర్‌(నెట్‌వర్క్‌)1, ఐటీ ఇంజినీర్‌ (సాఫ్ట్‌వేర్‌)2, ఐటీ ఇంజినీర్‌ (నెట్‌వర్క్‌)2 ఉన్నాయి. ఈ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించేందుకు టీటీడీ ప్రణాళికలు రూపొందిస్తోంది.

Updated Date - Dec 22 , 2025 | 02:14 AM