పీజీ అడ్మిషన్లకు ప్రభుత్వం పచ్చజెండా
ABN , Publish Date - Sep 08 , 2025 | 01:23 AM
రాష్ట్రంలోని యూనివర్సిటీలు, కాలేజీల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశానికి అడ్మిషన్లకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఆదివారం అడ్మిషన్ కమిటీ సమావేశమై నోటిఫికేషన్‌ను జారీ చేసింది. మంగళవారం నుంచి 15వ తేదీ దాకా వెబ్ కౌన్సెలింగ్‌కు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించారు.
తిరుపతి (విశ్వవిద్యాలయాలు), సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని యూనివర్సిటీలు, కాలేజీల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశానికి అడ్మిషన్లకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఆదివారం అడ్మిషన్ కమిటీ సమావేశమై నోటిఫికేషన్‌ను జారీ చేసింది. మంగళవారం నుంచి 15వ తేదీ దాకా వెబ్ కౌన్సెలింగ్‌కు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించారు. 9 నుంచీ 16 వ తేదీ దాకా వెరిఫికేషన్ కోసం సర్టిఫికెట్లు అప్‌లోడ్ చేయాలి. 12 నుంచీ 17 వ తేదీ దాకా వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. 18న వెబ్ ఆప్షన్లు మార్పు చేర్పులు చేసుకోవచ్చు. 20న సేట్లు కేటాయిస్తారు. 22 నుంచీ 24వ తేదీ దాకా సీటు వచ్చిన కాలేజీల్లో రిపోర్టు చేయాఆలి. అదే సమయంలో ఈనెల 22 నుంచే పీజీ ఫస్టియర్ క్లాసులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి షెడ్యూల్ విడుదల చేసింది.