రేషన్ దుకాణాల నుంచే సరుకులు
ABN , Publish Date - Jun 02 , 2025 | 02:33 AM
రేషన్ షాపులను పూలతో అలంకరించారు. మామిడి మండలూ కట్టారు. పండుగ వాతావరణంలో రేషన్ షాపుల ద్వారా సరుకుల పంపిణీని ఆదివారం ప్రారంభించారు. ప్రభుత్వం ఎండీయూ వాహనాలను రద్దు చేసి, చౌకదుకాణాల్లోనే సరుకుల పంపిణీకి ఈనెల నుంచి చర్యలు తీసుకుంది. తొలిరోజు 16 శాతం మంది సరుకులు తీసుకున్నట్లు సమాచారం. పలు రేషన్ షాపుల్లో సర్వర్ సమస్య తలెత్తడంతో సరుకుల పంపిణీలో జాప్యం జరిగింది. గూడూరులో ఎమ్మెల్యే పాశిం సునీల్‌కుమార్, సత్యవేడు నియోజకవర్గంలోని దాసుకుప్పం, రామగిరిలో ఎమ్మెల్యే ఆదిమూలం రేషన్ షాపుల్లో సరుకుల పంపిణీని ప్రారంభించారు. ఇక, తిరుపతి నగరం పెద్దకాపులేఅవుట్‌లోని షాపు నెంబరు 32, సత్యనారాయణపురంలోని 74, 75 రేషన్ షాపులలో కార్డుదారులకు సరుకులను ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చేతుల మీదుగా పంపిణీ చేశారు.
జిల్లా అంతటా పండుగ వాతావరణంలో ప్రారంభోత్సవాలు
తిరుపతి(నేరవిభాగం), జూన్ 1 (ఆంధ్రజ్యోతి): రేషన్ షాపులను పూలతో అలంకరించారు. మామిడి మండలూ కట్టారు. పండుగ వాతావరణంలో రేషన్ షాపుల ద్వారా సరుకుల పంపిణీని ఆదివారం ప్రారంభించారు. ప్రభుత్వం ఎండీయూ వాహనాలను రద్దు చేసి, చౌకదుకాణాల్లోనే సరుకుల పంపిణీకి ఈనెల నుంచి చర్యలు తీసుకుంది. తొలిరోజు 16 శాతం మంది సరుకులు తీసుకున్నట్లు సమాచారం. పలు రేషన్ షాపుల్లో సర్వర్ సమస్య తలెత్తడంతో సరుకుల పంపిణీలో జాప్యం జరిగింది. గూడూరులో ఎమ్మెల్యే పాశిం సునీల్‌కుమార్, సత్యవేడు నియోజకవర్గంలోని దాసుకుప్పం, రామగిరిలో ఎమ్మెల్యే ఆదిమూలం రేషన్ షాపుల్లో సరుకుల పంపిణీని ప్రారంభించారు. ఇక, తిరుపతి నగరం పెద్దకాపులేఅవుట్‌లోని షాపు నెంబరు 32, సత్యనారాయణపురంలోని 74, 75 రేషన్ షాపులలో కార్డుదారులకు సరుకులను ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చేతుల మీదుగా పంపిణీ చేశారు. వైసీపీ ప్రభుత్వంలో కార్డుదారులను నానా ఇబ్బందులు పెట్టారని, రేషన్ బండి ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి నెలకొందని ఆరణి అన్నారు. ఎండీయూ వాహన వ్యవస్థలో ఎదురైన సమస్యలను ప్రభుత్వం సమీక్షించి.. ప్రజలకు ప్రయోజనం కలిగించేలా రేషన్ షాపుల నుంచే నేరుగా పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుందన్నారు. బయట పనులకు వెళ్లేవారికి ఇది సౌలభ్యంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. కార్డుదారులకు సమస్యలుంటే బోర్డులో రాసిన నెంబర్లకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు ఆర్డీవో రామ్మోహన్‌రావు, డీఎ్‌సవో శేషాచలం రాజు, డీటీ సురేంద్ర, అర్బన్ తహసిల్దార్ భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ మునికృష్ణ, కార్పొరేటర్లు, కూటమి నేతలు ఎస్‌కే బాబు, అన్నా అనిత, పులుగోరు మురళి, సింగంశెట్టి సుబ్బరామయ్య, శ్రీనివాసులు రెడ్డి, రామకృష్ణారెడ్డి, రాజారెడ్డి, ఆకేపాటి సుభాషిణి, మహేష్ యాదవ్, భరణి యాదవ్, హేమంత్‌కుమార్, దూది శివ, బాలాజీ, శ్రీనివాస్, ఆళ్వార్ మురళి, మాధవరావు తదితరులు పాల్గొన్నారు.