Share News

బంధువుల ఇంటికొచ్చి వెళ్తూ..!

ABN , Publish Date - Nov 04 , 2025 | 12:59 AM

పెళ్లకూరు మండలం పెసలగుర్రప్పతోట వద్ద జాతీయ రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రీ కొడుకులు మృతిచెందారు.

బంధువుల ఇంటికొచ్చి వెళ్తూ..!
రూపేష్‌ (ఫైల్‌ఫొటో)

ట్యాంకర్‌ను ద్విచక్ర వాహనం ఢీకొనడంతో తండ్రీ కొడుకుల దుర్మరణం

పెళ్లకూరు, నవంబరు, 3 (ఆంధ్రజ్యోతి): పెళ్లకూరు మండలం పెసలగుర్రప్పతోట వద్ద జాతీయ రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రీ కొడుకులు మృతిచెందారు. శ్రీకాళహస్తి పట్టణం వీఎంపల్లె ప్రాంతానికి చెందిన ఉలస సుబ్రహ్మణ్యం(31), తన కుమారుడు రూపే్‌ష(9)తో కలిసి నాయుడుపేటలో బంధువుల ఇంటికి మోటార్‌ సైకిల్‌పై వెళ్లారు. తిరిగి వచ్చే సమయంలో పెసలగుర్రప్పతోట వద్ద రాంగ్‌ రూట్‌లో వెళ్తూ ట్యాంకర్‌ను ఢీకొన్నారు. సుబ్రహ్మణ్యం అక్కడికక్కడే మృతిచెందారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్‌ఐ నాగరాజు.. తీవ్రంగా గాయపడిన రూపే్‌షను ఎన్‌హెచ్‌ అంబులెన్స్‌లో నాయుడుపేట ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వెంటిలేటర్‌ లేకపోవడంతో శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించగా, అక్కడే చికిత్స పొందుతూ మృతి చెందారు. నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Nov 04 , 2025 | 12:59 AM