Share News

వైద్యం కోసం వెళ్తూ...

ABN , Publish Date - Sep 23 , 2025 | 01:16 AM

వైద్యం కోసం వెళ్తున్న తల్లీకొడుకులను కారు ఢీకొని దుర్మరణం చెందారు. నారాయణవనం మండలం టాసా ఫ్యాక్టరీ వద్ద సోమవారం ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.

వైద్యం కోసం వెళ్తూ...

నారాయణవనం, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): వైద్యం కోసం వెళ్తున్న తల్లీకొడుకులను కారు ఢీకొని దుర్మరణం చెందారు. నారాయణవనం మండలం టాసా ఫ్యాక్టరీ వద్ద సోమవారం ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. చిత్తూరు జిల్లా నిండ్ర మండలం ఐఆర్‌కండ్రికు చెందిన మునెమ్మ(47)ను ఆమె కుమారుడు బాలాజి(28) ద్విచక్ర వాహనంలో ఎక్కించుకుని తిరుపతిలోని ఆస్పత్రికి బయలుదేరారు. టాసా ఫ్యాక్టరీ వద్ద పాలమంగళం నుంచి వస్తున్న కారు వీరి బైకును ఢీకొనడంతో తల్లీకొడుకులు ఎగిరి రోడ్డు మీద పడి అక్కడికక్కడే మృతి చెందారు. మునెమ్మ భర్త కేశవులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాలను పుత్తూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. బాలాజి చెన్నైలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరు. భార్య, కుమారుడి మృతదేహాలను చూసి విలపిస్తున్న కేశవులును ఓదార్చడం ఎవరివల్ల కాలేదు.

Updated Date - Sep 23 , 2025 | 01:17 AM