Share News

అలిపిరిలోనే దేవుడు కనిపించాడు

ABN , Publish Date - Jul 01 , 2025 | 01:55 AM

తిరుమలకు వెళ్లే భక్తుల లగేజీకి అలిపిరి చెక్‌పాయింట్‌లో తనిఖీ తప్పనిసరి. సోమవారం ఉదయం 6.55 గంటలకు ఆరు స్కానర్లూ పనిచేయలేదు. విద్యుత్తు సరఫరా ఆగడం.. సర్వర్లు పనిచేయకపోవడం కారణమని చెబుతున్నారు. దీంతో భక్తులు తమ లగేజీ తనిఖీ చేయించుకోవడానికి ఎక్కువ సమయం నిరీక్షించాల్సి వచ్చింది. చివరకు ఏవీఎస్వో రమేష్‌, విజిలెన్సు ఇన్‌స్పెక్టర్‌ పురుషోత్తం రంగంలోకి దిగి అదనపు సిబ్బందితో లగేజీ బ్యాగులను తనిఖీ చేయించారు. దీంతో ఆలస్యం కావడంతో వాహనాలు బారులు తీరాయి. 9.30 గంటల వరకు ఇదే పరిస్థితి. తనిఖీల కోసం ఎక్కువ సమయం నిరీక్షించాల్సి రావడంతో భక్తులు అసహనానికి గురై సిబ్బంది ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆ తర్వాత లగేజీ స్కానర్లు పనిచేయడంతో యథావిధిగా తనిఖీలు జరిగాయి.

అలిపిరిలోనే దేవుడు కనిపించాడు
లగేజీ స్కానర్లు పనిచేయకపోవడంతో మాన్యువల్‌గా తనిఖీ

తిరుపతి(నేరవిభాగం), ఆంధ్రజ్యోతి : తిరుమలకు వెళ్లే భక్తుల లగేజీకి అలిపిరి చెక్‌పాయింట్‌లో తనిఖీ తప్పనిసరి. సోమవారం ఉదయం 6.55 గంటలకు ఆరు స్కానర్లూ పనిచేయలేదు. విద్యుత్తు సరఫరా ఆగడం.. సర్వర్లు పనిచేయకపోవడం కారణమని చెబుతున్నారు. దీంతో భక్తులు తమ లగేజీ తనిఖీ చేయించుకోవడానికి ఎక్కువ సమయం నిరీక్షించాల్సి వచ్చింది. చివరకు ఏవీఎస్వో రమేష్‌, విజిలెన్సు ఇన్‌స్పెక్టర్‌ పురుషోత్తం రంగంలోకి దిగి అదనపు సిబ్బందితో లగేజీ బ్యాగులను తనిఖీ చేయించారు. దీంతో ఆలస్యం కావడంతో వాహనాలు బారులు తీరాయి. 9.30 గంటల వరకు ఇదే పరిస్థితి. తనిఖీల కోసం ఎక్కువ సమయం నిరీక్షించాల్సి రావడంతో భక్తులు అసహనానికి గురై సిబ్బంది ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆ తర్వాత లగేజీ స్కానర్లు పనిచేయడంతో యథావిధిగా తనిఖీలు జరిగాయి.

Updated Date - Jul 01 , 2025 | 01:55 AM