వెళ్లిరా.. వినాయకా
ABN , Publish Date - Sep 01 , 2025 | 01:51 AM
ఒకవైపు డప్పుల శబ్ధం. మరోవైపు జైజై గణేశా, గణపతి బొప్పా మోరియా.. అంటూ నినాదాలు. విగ్రహాల ఊరేగింపు ముందు చిందేస్తున్న యువత. ఇలా ఆదివారం తిరుపతి నగరంలో సందడి నెలకొంది. ఆయా కూడళ్లలో విగ్రహాలు ప్రతిష్ఠించిన ఐదో రోజు వినాయక నిమజ్జనం జరిగింది.
ఒకవైపు డప్పుల శబ్ధం. మరోవైపు జైజై గణేశా, గణపతి బొప్పా మోరియా.. అంటూ నినాదాలు. విగ్రహాల ఊరేగింపు ముందు చిందేస్తున్న యువత. ఇలా ఆదివారం తిరుపతి నగరంలో సందడి నెలకొంది. ఆయా కూడళ్లలో విగ్రహాలు ప్రతిష్ఠించిన ఐదో రోజు వినాయక నిమజ్జనం జరిగింది. ఆయా విగ్రహాలను రూట్‌మ్యాప్ ప్రకారం వినాయక సాగర్‌కు తరలించారు. కొందరు ఇళ్ల వద్ద పూజలు చేసుకున్న ప్రతిమలనూ తీసుకొచ్చి నిమజ్జనం చేశారు. భారీ బందోబస్తు, పటిష్ట ఏర్పాట్లతో ఈ కార్యక్రమం ప్రశాంతంగా ముగిసింది.
- తిరుపతి(జీవకోన), ఆంధ్రజ్యోతి