హంస వాహనంపై జ్ఞానప్రదాయని
ABN , Publish Date - Nov 18 , 2025 | 11:47 PM
తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం పెద్ద శేష, హంస వాహన సేవలు జరిగాయి. ఉదయం శంఖు, చక్ర, గదాధారి అయి పరమపద వైకుంఠనాథుడి రూపంలో అమ్మవారు పెద్దశేష వాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ బక్తులను సాక్షాత్కరించారు.
తిరుచానూరు, నవంబరు 18(ఆంధ్రజ్యోతి): తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం పెద్ద శేష, హంస వాహన సేవలు జరిగాయి. ఉదయం శంఖు, చక్ర, గదాధారి అయి పరమపద వైకుంఠనాథుడి రూపంలో అమ్మవారు పెద్దశేష వాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ బక్తులను సాక్షాత్కరించారు. గంటకుపైగా చిరుజల్లుల మధ్య.. ఘటాటోపం కింద పెద్దశేషవాహనసేవ సాగింది. మధ్యాహ్నం స్నపన తిరుమంజనం, సాయంత్రం ఊంజల్‌సేవ నిర్వహించారు. రాత్రి వీణాపాణిగా హంసవాహనంపై జ్ఞానప్రదాయిని భక్తులకు దర్శనమిచ్చారు. వాహన సేవల ముందు సాంస్కృతిక కళా ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఆయా కార్యక్రమాల్లో జీయర్‌స్వాములు, టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, జేఈవో వీరబ్రహ్మం, డిప్యూటీ ఈవో హరీందర్‌నాథ్, ఏఈవో దేవరాజులు, ఏవీఎస్వో రాధాకృష్ణమూర్తి, అర్చకులు శ్రీనివాసాచార్యులు, బాబుస్వామి, మణికంఠస్వామి, సూపరింటెండెంట్లు రమేష్, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ ప్రసాద్, చలపతి, సుబ్బరాయుడు, సుభాస్కర్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు
బ్రహ్మోత్సవాల్లో నేడు
ఉదయం ముత్యపుపందిరి వాహనం
రాత్రి సింహ వాహన సేవ