వైభవం...రథోత్సవం
ABN , Publish Date - Sep 04 , 2025 | 02:08 AM
కాణిపాకంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాల్లో బుధవారం మధ్యాహ్నం వరసిద్ధుడికి రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు.కాకర్లవారిపల్లెకు చెందిన కీర్తిశేషులు ఎత్తిరాజులునాయుడు,శివప్రసాద్ జ్ఞాపకార్థం మీనాకుమారి, కాణిపాకానికి చెందిన మాజీ వీఎం పూర్ణచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, మాజీ వీఎం కీర్తి శేషులు చంద్రశేఖరరెడ్డి జ్ఞాపకార్థం ఆయన కుమారుడు హరిప్రసాదరెడ్డి ఉభయదారులుగా వ్యవహిరించారు. ఉదయం మూల విరాట్‌కు ఘనంగా అభిషేకం నిర్వహించాక అలంకార మండపంలో సిద్ధి,బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామి ఉత్సవ విగ్రహాలకు పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం బ్రహ్మరథంపై ఆశీనులను కావించి ఉదయం 7.30 గంటల నుంచి 8.30 గంటల మధ్య రఽథాన్ని భక్తులు, ఉభయదారులు కొంత దూరం లాగి భక్తుల దర్శనార్థం ఉంచారు. జిల్లా నలుమూలల నుంచి విచ్చేసిన భక్తులు బ్రహ్మరథంపై ఉప్పు, బొరుగులు, మిరియాలు, చిల్లర నాణస్త్రలు చల్లి, కొబ్బరి కాయలు సమర్పించి, కర్పూర హారతులతో మొక్కులు తీర్చుకున్నారు.రథోత్సవాన్ని పురస్కరించుకొని ఆలయంలో పుష్పాలంకరణలు, వివిధ రకాల దేవతామూర్తుల ప్రతిమలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. రథోత్సవ సమయంలో ఆలయ సిబ్బంది ధరించిన సైనికుల వేషధారణలు, కీలు గుర్రాలు ఆకర్షించాయి.
ఐరాల(కాణిపాకం), సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): కాణిపాకంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాల్లో బుధవారం మధ్యాహ్నం వరసిద్ధుడికి రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు.కాకర్లవారిపల్లెకు చెందిన కీర్తిశేషులు ఎత్తిరాజులునాయుడు,శివప్రసాద్ జ్ఞాపకార్థం మీనాకుమారి, కాణిపాకానికి చెందిన మాజీ వీఎం పూర్ణచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, మాజీ వీఎం కీర్తి శేషులు చంద్రశేఖరరెడ్డి జ్ఞాపకార్థం ఆయన కుమారుడు హరిప్రసాదరెడ్డి ఉభయదారులుగా వ్యవహిరించారు. ఉదయం మూల విరాట్‌కు ఘనంగా అభిషేకం నిర్వహించాక అలంకార మండపంలో సిద్ధి,బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామి ఉత్సవ విగ్రహాలకు పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం బ్రహ్మరథంపై ఆశీనులను కావించి ఉదయం 7.30 గంటల నుంచి 8.30 గంటల మధ్య రఽథాన్ని భక్తులు, ఉభయదారులు కొంత దూరం లాగి భక్తుల దర్శనార్థం ఉంచారు. జిల్లా నలుమూలల నుంచి విచ్చేసిన భక్తులు బ్రహ్మరథంపై ఉప్పు, బొరుగులు, మిరియాలు, చిల్లర నాణస్త్రలు చల్లి, కొబ్బరి కాయలు సమర్పించి, కర్పూర హారతులతో మొక్కులు తీర్చుకున్నారు.రథోత్సవాన్ని పురస్కరించుకొని ఆలయంలో పుష్పాలంకరణలు, వివిధ రకాల దేవతామూర్తుల ప్రతిమలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. రథోత్సవ సమయంలో ఆలయ సిబ్బంది ధరించిన సైనికుల వేషధారణలు, కీలు గుర్రాలు ఆకర్షించాయి.అశేష భక్తజనం నడుమ మధ్యాహ్నం 3 గంటల సమయంలో రథాన్ని కాణిపాకం పురవీధుల్లో ఊరేగించారు.ఈవో పెంచలకిషోర్, ఈఈ వెంకటనారాయణ, ఏఈవోలు, ఎస్వీ కృష్ణారెడ్డి, రవీంద్రబాబు, ధనపాల్,ధనంజయ,సూపరింటెండెంట్లు కోదండపాణి, శ్రీధర్‌బాబు,ఆలయ ఇన్‌స్పెక్టర్లు చిట్టిబాబు, బాలాజీనాయుడు పాల్గొన్నారు.బ్రహోత్సవాల్లో గురువారం ఉదయం భిక్షాండి కార్యక్రమాన్ని,రాత్రి అశ్వవాహన సేవను నిర్వహించనున్నారు.కాగా ద్వారకా తిరుమల ఆలయం తరఫున ఈవో సత్యనాయణ బుధవారం వరసిద్ధుడికి పట్టు వస్త్రాలను సమర్పించారు.