Share News

లైఫ్‌ సర్టిఫికెట్‌ ఫిబ్రవరిలోపు ఇవ్వండి

ABN , Publish Date - Nov 23 , 2025 | 01:22 AM

జిల్లాలోని పెన్షనర్లు లైఫ్‌ సర్టిఫికెట్‌(యాన్యువల్‌ వెరిఫికేషన్‌ సర్టిఫికెట్‌)ను 2026 ఫిబ్రవరి 28వ తేదీలోపు అందజేయాలని జిల్లా ఖజానా, లెక్కల అధికారి ఎం.లక్ష్మీకర్‌రెడ్డి కోరారు. ఆన్‌లైన్‌ ద్వారా గాని, ట్రెజరీ కార్యాలయంలో నేరుగా గానీ అందజేయవచ్చని వివరించారు.

లైఫ్‌ సర్టిఫికెట్‌ ఫిబ్రవరిలోపు ఇవ్వండి

జిల్లా ఖజానా అధికారి లక్ష్మీకర్‌రెడ్డి

తిరుపతి(జీవకోన), నవంబరు 22(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని పెన్షనర్లు లైఫ్‌ సర్టిఫికెట్‌(యాన్యువల్‌ వెరిఫికేషన్‌ సర్టిఫికెట్‌)ను 2026 ఫిబ్రవరి 28వ తేదీలోపు అందజేయాలని జిల్లా ఖజానా, లెక్కల అధికారి ఎం.లక్ష్మీకర్‌రెడ్డి కోరారు. ఆన్‌లైన్‌ ద్వారా గాని, ట్రెజరీ కార్యాలయంలో నేరుగా గానీ అందజేయవచ్చని వివరించారు. శనివారం ఆయన ఆంధ్రజ్యోతి ప్రతినిధితో మాట్లాడుతూ గతంలో నవంబరు, డిసెంబరు నెలల్లో సర్టిఫికెట్‌ తీసుకునే వారని, ఇప్పుడు దాన్ని జనవరి, ఫిబ్రవరికి మార్చినట్లు చెప్పారు. జిల్లాలోని 17,426 మంది పెన్షనర్ల సౌకర్యార్థం తిరుపతిలోని ఉప ఖజానా కార్యాలయంలో జనవరి, ఫిబ్రవరి నెలల్లో రెండు కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అదే విధంగా పాకాల, చంద్రగిరి, పుత్తూరు, సత్యవేడు, శ్రీకాళహస్తి, తొట్టంబేడు, నాయుడుపేట, సూళ్లూరుపేట, వాకాడు, గూడూరు, వెంకటగిరిలోని సబ్‌ ట్రెజరీ కార్యాలయాల్లోనూ సర్టిఫికెట్‌ అందజేయవచ్చన్నారు.

మార్పులు, చేర్పులకు అవకాశం

మెగా డీఎస్సీ ద్వారా ఎంపికైన ఉపాధ్యాయులు తమ అపాయింట్‌మెంట్‌ ఆర్డర్లలో ఉన్న పేర్లు, పుట్టిన తేదీ, ఇతర మార్పులు చేర్పులకు అవకాశం కల్పిస్తున్నట్లు లక్ష్మీకర్‌రెడ్డి తెలిపారు. ట్రెజరీ కార్యాలయంలో సంప్రదిస్తే వాటి ఫిజికల్‌ కాపీలను పరిశీలించి ట్రెజరీ ద్వారా ప్రభుత్వానికి పంపుతామన్నారు. మెయిల్‌ ద్వారా పంపవద్దని సూచించారు. ఈ అవకాశాన్ని నూతనంగా ఎంపికైన ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Updated Date - Nov 23 , 2025 | 01:22 AM