Share News

సీఎం పర్యటనకు సిద్ధం కండి

ABN , Publish Date - Jun 29 , 2025 | 01:21 AM

ముఖ్యమంత్రి చంద్రబాబు కుప్పం పర్యటన ఏర్పాట్లపై శనివారం క్యాంపు కార్యాలయం నుంచి వివిధ శాఖాధికారులతో టెలికాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్‌ సమీక్షించారు.

సీఎం పర్యటనకు సిద్ధం కండి

-అధికారులతో కలెక్టర్‌ టెలికాన్ఫరెన్స్‌

చిత్తూరు సెంట్రల్‌, జూన్‌ 28 (ఆంధ్రజ్యోతి):ముఖ్యమంత్రి చంద్రబాబు కుప్పం పర్యటన ఏర్పాట్లపై శనివారం క్యాంపు కార్యాలయం నుంచి వివిధ శాఖాధికారులతో టెలికాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్‌ సమీక్షించారు. కడపల్లెలోని నివాసంలో సోమవారం రాత్రి బస చేయనున్న చంద్రబాబు మరుసటి రోజు ఉదయం ఓ అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశీలిస్తారని, బహిరంగసభలో పాల్గొని, స్టాళ్లను సందర్శిస్తారన్నారు. వివిధ శాఖల ద్వారా లబ్ధిదారులకు మెగా చెక్కులు, వివిధ ఆస్తి పనిముట్లు పంపిణీ చేస్తారని, వాటన్నింటినీ సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు.టాటా కన్సల్టెన్సీ భాగస్వామ్యంతో కుప్పం ప్రభుత్వ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన డిజిటల్‌ సర్వే సెంటర్‌ను ప్రారంభించడంతో పాటు అధికారులతో సమీక్ష ఉంటుందన్నారు.ఇందుకు తగిన విధంగా సిద్ధం కావాలని డీఎంహెచ్‌వో, డీసీహెచ్‌ఎ్‌సలను ఆదేశించారు. డీపీవో, కుప్పం మున్సిపల్‌ కమిషనర్‌, ఎంపీడీవో ఆధ్వర్యంలో శాంతిపురం,కుప్పం మండలాల ప్రధాన కేంద్రాల్లో పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, బహిరంగ స్థలంలో బారికేడ్లు పటిష్టంగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. హెలిపాడ్‌ వద్ద , సీఎం పర్యటించే ప్రదేశాల్లో పటిష్టమైన భద్రత చేపట్టాలని సూచించారు. బహిరంగ సభ వద్ద తాగునీరు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు.వివిధ శాఖల పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులపై సమగ్ర డీపీఆర్‌ తయారు చేసుకోవాలన్నారు. బహిరంగ సభ వద్ద జేసీ ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. కడా పీడీ వికాస్‌ మర్మత్‌,డీఆర్వో మోహన్‌కుమార్‌, కుప్పం ఆర్డీవో, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jun 29 , 2025 | 01:21 AM