Share News

సౌమ్యుడు సతీ్‌షకుమార్‌

ABN , Publish Date - Nov 15 , 2025 | 01:43 AM

విజిలెన్స్‌ అధికారిగా చురుగ్గా సుదీర్ఘకాలం సేవలందించిన సతీ్‌షకుమార్‌ మృతి టీటీడీ ఉద్యోగులను తీవ్ర దిగ్ర్భాంతికి గురిచేసింది.

సౌమ్యుడు సతీ్‌షకుమార్‌
సతీష్‌ కుమార్‌

టీటీడీలో ఏడేళ్లకుపైగా విధులు

గుర్తు చేసుకుంటున్న ఉద్యోగులు

తిరుమల, నవంబరు14 (ఆంధ్రజ్యోతి): విజిలెన్స్‌ అధికారిగా చురుగ్గా సుదీర్ఘకాలం సేవలందించిన సతీ్‌షకుమార్‌ మృతి టీటీడీ ఉద్యోగులను తీవ్ర దిగ్ర్భాంతికి గురిచేసింది. డిప్యుటేషన్‌పై వచ్చిన అధికారిలా కాకుండా టీటీడీ ఉద్యోగిలానే అయన వ్యవహరించేవారని గుర్తు చేసుకుంటున్నారు. తన సెక్టార్‌ కాకపోయినప్పటికీ ఎక్కడ సమస్య ఎదురైనా సతీ్‌షకుమార్‌ ఇట్టే వాలిపోయి సేవలందించేవారని అంటున్నారు. విధుల్లో ఆయన భక్తులతో ఎంతో సౌమ్యంగా వ్యవహరించేవారు. శ్రీవారి పరకామణి లెక్కింపు చోరీ కేసులో ఈయన ఫిర్యాదుదారునిగా ఉండడంతో తీవ్రమైన చర్చ జరుగుతోంది.

విజిలెన్స్‌లో ఏడేళ్లు

కర్నూలు జిల్లాలోని పత్తికొండకు చెందిన వై సతీ్‌షకుమార్‌ రిజర్వ్‌ ఎస్‌ఐగా విధుల్లో చేరారు. 2017 జూలై 27న టీటీడీ విజిలెన్స్‌ విభాగానికి విజిలెన్స్‌ ఇన్ప్సెక్టర్‌గా వచ్చారు. తొలుత శ్రీవారి ఆలయం, తర్వాత వైకుంఠం క్యూకాంప్లెక్స్‌ వీఐగా 2022 ఆగస్టు 1వరకు విధులు నిర్వహించారు. ఆ తర్వాత మాతృసంస్థకు బదిలీ అయ్యారు. సీఐగా పదోన్నతి లభించింది. దీంతో నెల వ్యవధిలోనే 2022 సెప్టెంబరు 27న తిరిగి శ్రీవారి ఆలయంలో హుండీ లెక్కింపు పరకామణి ఏవీఎస్వో (అసిస్టెంట్‌ విజిలెన్స్‌ అండ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌)గా నియమితులయ్యారు. 2023లో పరకామణి దొంగతనం కేసు జరిగే వరకు అక్కడే ఏవీఎస్వోగా ఉన్నారు. ఆ తర్వాత సెక్టారు3, లగేజీ ఏవీఎస్వోగా విధులు చేపట్టారు. అదే ఏడాది చివరిలో తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయ ఏవీఎస్వోగా బాధ్యతలు చేపట్టి ఈ ఏడాది జూన్‌ 4వరకు పనిచేశారు. మొత్తంగా పలు సెక్టార్లలో ఏడేళ్ల ఆరునెలల పాటు విధులు నిర్వహించారు.

Updated Date - Nov 15 , 2025 | 01:43 AM