గ్యాస్ ఏజెన్సీకి రూ.10వేల జరిమానా
ABN , Publish Date - Nov 23 , 2025 | 01:28 AM
నియోగదారుడి వద్ద గ్యాస్ సిలిండర్‌కు అధిక ధర వసూలు చేసిన పుంగనూరులోని వీరభద్ర ఇండేన్ గ్యాస్ ఏజెన్సీకి రూ. 10వేల జరిమానా విఽధించాలని డీఎస్వో శంకరన్‌ను కలెక్టర్ సుమిత్‌కుమార్ ఆదేశించారు.
చిత్తూరు కలెక్టరేట్, నవంబరు 22(ఆంధ్రజ్యోతి): వినియోగదారుడి వద్ద గ్యాస్ సిలిండర్‌కు అధిక ధర వసూలు చేసిన పుంగనూరులోని వీరభద్ర ఇండేన్ గ్యాస్ ఏజెన్సీకి రూ. 10వేల జరిమానా విఽధించాలని డీఎస్వో శంకరన్‌ను కలెక్టర్ సుమిత్‌కుమార్ ఆదేశించారు. గ్యాస్ సిలిండర్ల పంపిణీపై ఇటీవల ప్రభుత్వం ఐవీఆర్‌ఎస్ ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ చేస్తోంది. అందులో పలువురు వినియోగదారులు వీరభద్ర ఏజెన్సీ బాయ్స్ సిలిండర్‌కు రూ.50 చొప్పున వసూలు చేస్తున్నారని, దీనిపై ఏజెన్సీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఫిర్యాదు చేశారు. ప్రజాభిప్రాయ సేకరణ ఆధారంగా ఏజెన్సీకి రూ.50వేల జరిమానాకు కలెక్టర్ ఆదేశించారు. దీంతో ఆ ఏజెన్సీ నిర్వాహకుడితో పాటు గ్యాస్ డీలర్స్ అసోసియేషన్ ప్రతినిధులు శుక్రవారం కలెక్టర్‌ను కలిసి ఇందుకు బాధ్యులైన బాయ్స్‌ను తొలగించామని వివరించారు. తొలి తప్పుగా భావించి జరిమానా మొత్తాన్ని తగ్గించాలని కోరడంతో జరిమానాను రూ. 50వేల నుంచి రూ. 10 వేలకు తగ్గించారు. మరోసారి ఇలా జరిగితే ఏజెన్సీ లైసెన్స్‌ను రద్దు చేయడంతో పాటు నిర్వాహకులపై చట్టపర చర్యలు తీసుకోవాలని డీఎస్వోను కలెక్టర్ ఆదేశించారు.