పోలీసు కస్టడీకి గ్యాంగ్‌రేప్ నిందితులు
ABN , Publish Date - Oct 12 , 2025 | 01:47 AM
ఇంటర్ విద్యార్థినిపై గ్యాంగ్‌రే్‌పకు పాల్పడిన కేసుకు సంబంధించి రిమాండ్‌లో ఉన్న ముగ్గురు నిందితులను పోలీసులు శనివారం కస్టడీకి తీసుకున్నారు.
చిత్తూరు అర్బన్, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): ఇంటర్ విద్యార్థినిపై గ్యాంగ్‌రే్‌పకు పాల్పడిన కేసుకు సంబంధించి రిమాండ్‌లో ఉన్న ముగ్గురు నిందితులను పోలీసులు శనివారం కస్టడీకి తీసుకున్నారు.చిత్తూరు శివార్లలోని మురకంబట్టు నగరవనంలో బాలికను బెదిరించి గ్యాంగ్‌రే్‌పకు పాల్పడిన నిందితులను తాలూకా పోలీసులు అరెస్టు చేసి ఈ నెల 3వ తేది రిమాండ్‌కు తరలించారు.వారినుంచి మరింత సమాచారం రాబట్టడం కోసం పోలీసులు కస్టడీ కోరుతూ పిటిషన్ వేశారు. ఈ నేపథ్యంలో కోర్టు అనుమతి మేరకు శనివారం గ్యాంగ్‌రేప్ నిందితులను కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు.