Share News

స్వర్ణమ్మకు గంగా హారతి

ABN , Publish Date - Nov 20 , 2025 | 01:40 AM

కార్తీక మాసం.. అమావాస్యను పురస్కరించుకుని బుధవారం సాయంత్రం స్వర్ణముఖి నదికి గంగా హారతులిచ్చారు. తొలుత ముక్కంటి ఆలయం నుంచి గంగాదేవి ఉత్సవమూర్తిని స్వర్ణముఖి నదిలోని సద్యోముక్తి ప్రదేశం వరకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. నదీ జలాలకు, ఉత్సవమూర్తికి పండితులు పూజలు చేశారు. గంగాదేవికి శాస్త్రోక్తంగా సారె సమర్పించారు. అనంతరం మంగళవాయిద్యాలు, వేదమంత్రాల నడుమ అర్చకులు స్వర్ణమ్మకు ద్వాదశ(12) హారతులు పట్టారు. ఆగమ నియమాల ప్రకారం వివిధ రకాల హారతులను వరుసగా గంగమ్మకు సమర్పించారు. పలువురు భక్తులు నదీ దీపాలు వెలిగించారు. ఈ సందర్భంగా ఆలయంతో పాటు స్వర్ణముఖి నది వద్ద విద్యుత్తు అలంకరణలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సుధీర్‌, బొజ్జల బృందమ్మ, ముక్కంటి ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్‌ కొట్టే సాయి, సభ్యులు, ఈవో బాపిరెడ్డి, అధికారులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

స్వర్ణమ్మకు గంగా హారతి
నదీహారతులు ఇస్తున్న వేదపండితులు

శ్రీకాళహస్తి, ఆంధ్రజ్యోతి: కార్తీక మాసం.. అమావాస్యను పురస్కరించుకుని బుధవారం సాయంత్రం స్వర్ణముఖి నదికి గంగా హారతులిచ్చారు. తొలుత ముక్కంటి ఆలయం నుంచి గంగాదేవి ఉత్సవమూర్తిని స్వర్ణముఖి నదిలోని సద్యోముక్తి ప్రదేశం వరకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. నదీ జలాలకు, ఉత్సవమూర్తికి పండితులు పూజలు చేశారు. గంగాదేవికి శాస్త్రోక్తంగా సారె సమర్పించారు. అనంతరం మంగళవాయిద్యాలు, వేదమంత్రాల నడుమ అర్చకులు స్వర్ణమ్మకు ద్వాదశ(12) హారతులు పట్టారు. ఆగమ నియమాల ప్రకారం వివిధ రకాల హారతులను వరుసగా గంగమ్మకు సమర్పించారు. పలువురు భక్తులు నదీ దీపాలు వెలిగించారు. ఈ సందర్భంగా ఆలయంతో పాటు స్వర్ణముఖి నది వద్ద విద్యుత్తు అలంకరణలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సుధీర్‌, బొజ్జల బృందమ్మ, ముక్కంటి ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్‌ కొట్టే సాయి, సభ్యులు, ఈవో బాపిరెడ్డి, అధికారులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Nov 20 , 2025 | 01:41 AM