గ్యాంగ్ రేప్ విచారణ వేగవంతం
ABN , Publish Date - Oct 02 , 2025 | 01:39 AM
పూతలపట్టు మండలానికి చెందిన బాలికపై అత్యాచార ఘటనకు సంబంధించి పోలీసులు విచారణ వేగవంతం చేశారు.గత నెల 25వ తేది మురకంబట్టు సమీపంలోని అటవీశాఖ నగరవనంలో ఇంటర్ విద్యార్థినిపై ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడడం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.
చిత్తూరు అర్బన్, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): పూతలపట్టు మండలానికి చెందిన బాలికపై అత్యాచార ఘటనకు సంబంధించి పోలీసులు విచారణ వేగవంతం చేశారు.గత నెల 25వ తేది మురకంబట్టు సమీపంలోని అటవీశాఖ నగరవనంలో ఇంటర్ విద్యార్థినిపై ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడడం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.ఈ దారుణానికి పాల్పడిన మంగసముద్రం దళితవాడకు చెందిన హేమంత్, మురకంబట్టు అగ్రహారానికి చెందిన కిశోర్, మహే్‌షలను పోలీసులు అదుపులోకి తీసుకుని రహస్య ప్రదేశంలో విచారిస్తున్నట్లు సమాచారం. వీరు కొంతకాలంగా ఒంటరిగా పార్కుకు వచ్చే వారిని బెదిరించి నగలు, నగదును దోచుకెళ్లేవారని తెలిసింది. నిందితుల ఫోన్లను స్వాధీనం చేసుకుని ఆ ఫోన్లలో ఉన్న వివరాలను సేకరించే పనిలో పోలీసులున్నారు. బుధవారం ఫోరెన్సిక్ నిపుణులు సంఘటనా స్థలం వద్ద ఆధారాలు సేకరించారు. గతంలో ఎవరిపైన అయినా ఇలాంటి అఘాయిత్యాలకు నిందితులు పాల్పడ్డారా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం. నిందితులను గురువారం అరెస్టు చూపే అవకాశం ఉన్నట్లు తెలిసింది. కాగా తాలూకా పోలీసు స్టేషన్ పరిఽధిలో సీతమ్స్, అపోలో ఇంజనీరింగ్ కాలేజీలున్నాయి.పెద్దసంఖ్యలో విద్యార్థులు చదువుకుంటున్నారు. ఈ పోలీసు స్టేషన్ పరిధిలో 27మంది పని చేస్తున్నప్పటికీ వారిలో 14 మంది వివిధ చోట్ల విధులు నిర్వహిస్తున్నారు.మిగిలిన 13మందితోనే విధుల నిర్వహణ కష్టంగా ఉందని పోలీసులు ఆవేదన వ్యక్తం చేశారు.