గ్యాంగ్ రేప్ నిందితులకు రిమాండు
ABN , Publish Date - Oct 04 , 2025 | 02:28 AM
జిల్లా కేంద్రం చిత్తూరులో బాలికపై గ్యాంగ్‌రేప్ చేసిన ముగ్గురు నిందితులను శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. మీడియా సమావేశం పూర్తయ్యాక జిల్లా పోలీసు కార్యాలయం నుంచి అర కిలోమీటరు దూరంలో ఉన్న కోర్టు వరకు నిందితులను నడిపించుకుంటూ తీసుకెళ్లారు. అంతకుముందు డీపీవో కార్యాలయంలో సీఐలు నిత్యబాబు, మహేశ్వర, శ్రీధర్‌నాయుడితో కలిసి చిత్తూరు డీఎస్పీ సాయినాథ్ మీడియాకు వివరాలను తెలియజేశారు. గత నెల 25వ తేదీన చిత్తూరు నగరం మురకంబట్టు సమీపంలో ఉన్న నీవా నగరవనం పార్కులో ఉండిన ఓ ప్రేమజంటలోని బాలికపై ముగ్గురు అత్యాచారం చేసి, వారి వద్ద నుంచి విలువైన వస్తువులను తీసుకెళ్లిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. యువకుడు ఇచ్చిన ఫిర్యాదుతో గత నెల 29వ తేదీన తాలూకా పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఆ మరుసటి రోజు బాధితురాలు ఇచ్చిన వాంగ్మూలంతో వివిధ సెక్షన్ల కింద అత్యాచారం కేసుగా నమోదు చేశారు. ఎస్పీ తుషార్ ఆదేశాలతో మూడు బృందాలు నిందితుల కోసం గాలింపు చేపట్టాయి. శుక్రవారం పోలీసులకు అందిన సమాచారం మేరకు చిత్తూరు నగర పరిధిలోని చెన్నమ్మగుడిపల్లె రహదారి వద్ద వాకర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన ట్రాక్ వద్ద మురకంబట్టు జీకే నగర్‌కు చెందిన మహేష్(21), మురకంబట్టు అగ్రహారానికి చెందిన కిశోర్(31), మంగసముద్రానికి చెందిన హేమంత్(27)లను పోలీసులు అరెస్టు చేశారు. వాంగ్మూలాన్ని రికార్డు చేశాక వారి వద్ద సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. కాగా, నిందితుల్లో ఒకరైన మహేష్.. ఈవ్‌టీజింగ్ కేసులో ఇదివరకే నిందితుడిగా ఉన్నాడు.
చిత్తూరు అర్బన్, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రం చిత్తూరులో బాలికపై గ్యాంగ్‌రేప్ చేసిన ముగ్గురు నిందితులను శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. మీడియా సమావేశం పూర్తయ్యాక జిల్లా పోలీసు కార్యాలయం నుంచి అర కిలోమీటరు దూరంలో ఉన్న కోర్టు వరకు నిందితులను నడిపించుకుంటూ తీసుకెళ్లారు. అంతకుముందు డీపీవో కార్యాలయంలో సీఐలు నిత్యబాబు, మహేశ్వర, శ్రీధర్‌నాయుడితో కలిసి చిత్తూరు డీఎస్పీ సాయినాథ్ మీడియాకు వివరాలను తెలియజేశారు. గత నెల 25వ తేదీన చిత్తూరు నగరం మురకంబట్టు సమీపంలో ఉన్న నీవా నగరవనం పార్కులో ఉండిన ఓ ప్రేమజంటలోని బాలికపై ముగ్గురు అత్యాచారం చేసి, వారి వద్ద నుంచి విలువైన వస్తువులను తీసుకెళ్లిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. యువకుడు ఇచ్చిన ఫిర్యాదుతో గత నెల 29వ తేదీన తాలూకా పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఆ మరుసటి రోజు బాధితురాలు ఇచ్చిన వాంగ్మూలంతో వివిధ సెక్షన్ల కింద అత్యాచారం కేసుగా నమోదు చేశారు. ఎస్పీ తుషార్ ఆదేశాలతో మూడు బృందాలు నిందితుల కోసం గాలింపు చేపట్టాయి. శుక్రవారం పోలీసులకు అందిన సమాచారం మేరకు చిత్తూరు నగర పరిధిలోని చెన్నమ్మగుడిపల్లె రహదారి వద్ద వాకర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన ట్రాక్ వద్ద మురకంబట్టు జీకే నగర్‌కు చెందిన మహేష్(21), మురకంబట్టు అగ్రహారానికి చెందిన కిశోర్(31), మంగసముద్రానికి చెందిన హేమంత్(27)లను పోలీసులు అరెస్టు చేశారు. వాంగ్మూలాన్ని రికార్డు చేశాక వారి వద్ద సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. కాగా, నిందితుల్లో ఒకరైన మహేష్.. ఈవ్‌టీజింగ్ కేసులో ఇదివరకే నిందితుడిగా ఉన్నాడు. కిశోర్ 2022లో నగరరంలోని ఓ వైన్‌షాపులో పనిచేస్తూ అక్కడి మద్యాన్ని బ్లాక్‌లో విక్రయించాడని కేసు నమోదైంది. కాలక్షేపం కోసం పార్కులకు వచ్చే ప్రేమ జంటలను లక్ష్యంగా చేసుకుని వారు కలిసున్న దృశ్యాలను వీడియోలు తీసి బెదిరించడం.. వారి వద్ద ఉన్న నగదు, బంగారాన్ని లాక్కోవడం.. అత్యాచారం చేయడం.. వీరి ప్రవృత్తిగా పోలీసుల విచారణలో వెల్లడైంది.
బేడీలు వేసి.. రోడ్డుపై నడిపించి..
ముగ్గురు నిందితులకు పోలీసులు సరికొత్త శిక్ష విధించారు. మీడియా సమావేశమయ్యాక వారిని డీపీవో కార్యాలయం నుంచి అర కిలో మీటరు దూరంలో ఉన్న కోర్డు వరకు బేడీలు వేసి రోడ్డుపై నడిపించుకుంటూ తీసుకెళ్లారు. రోడ్డు పొడవునా పెద్ద సంఖ్యలో ప్రజలు వారు చేసి అఘాయిత్యం తలచుకుని అసహ్యించుకున్నారు. అనంతరం కోర్డులో హాజరుపరిచారు. ముగ్గురు నిందితుల్ని పోక్సో కోర్టు జడ్జి శంకరరావు ఈ నెల 16వ తేదీవరకు రిమాండ్ విధించారు.
పార్కుల వద్ద పటిష్ఠ బందోబస్తు:డీఎస్పీ
పార్కుల వద్ద దొంగతనాలు, అత్యాచారాలు జరిగిన నేపథ్యంలో ఇకపై నగరంలోని అన్నిపార్కుల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేస్తామని డీఎస్పీ సాయినాథ్ చెప్పారు. ‘చిత్తూరు మున్సిపాలిటీ, అటవీశాఖల అధికారులతో త్వరలో సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాం. అన్ని పార్కుల వద్ద సీసీ కెమెరాలు పనిచేసే విధంగా చర్యలు చేపడతాం. పిల్లల పట్ల తల్లిదండ్రులు, విద్యాసంస్థలు కూడా దృష్టి పెట్టాలి. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటాం’ అని వివరించారు.