పుష్పపల్లకిలో వరసిద్ధుడు
ABN , Publish Date - Sep 14 , 2025 | 01:15 AM
కాణిపాక క్షేత్రంలో నిర్వహిస్తున్న ప్రత్యేక ఉత్సవాల్లో శనివారం రాత్రి స్వామివారు పుష్ప పల్లకిలో విహరిస్తూ భక్త జనులకు దర్శనమిచ్చారు.
ఐరాల(కాణిపాకం), సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): కాణిపాక క్షేత్రంలో నిర్వహిస్తున్న ప్రత్యేక ఉత్సవాల్లో శనివారం రాత్రి స్వామివారు పుష్ప పల్లకిలో విహరిస్తూ భక్త జనులకు దర్శనమిచ్చారు.భాగ్యలక్ష్మి, దివంగత మోహన్‌నాయుడు,వీటీ రాజన్ అండ్ బ్రదర్స్, రామనాథ నాయుడు,రాజారెడ్డి జ్ఞాపకార్థం,కృష్ణమ నాయుడి జ్ఞాపకార్థం వారి కుమారులు, నరసింహారెడ్డి అండ్ సన్స్, రాజారెడ్డి అండ్ కో, కీర్తిశేషులు శ్రీరాములరెడ్డి, బాలకృష్ణారెడ్డి, శేషయ్య నాయుడు అండ్ సన్స్, కుమరేంద్రచౌదరి, మనోహర నాయుడు అండ్ బ్రదర్స్, ఆంజనేయులు నాయుడు అండ్ సన్స్ ఉభయదారులుగా వ్యవహరించారు. ఉదయం మూలవిరాట్‌కు ఉభయదారుల ఆధ్వర్యంలో అభిషేకం నిర్వహించి చందనాలంకారంతో భక్తులకు దర్శనం కల్పించారు. రాత్రి ఉభయదారులు ఉభయ వరస తీసుకురాగానే అలంకార మండపంలో స్వామివారి ఉత్సవ విగ్రహాలకు విశేష పూజలు నిర్వహి ంచి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం సిద్ధి, బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామివారి ఉత్సవమూర్తులను సంప్రదాయ బద్ధంగా తీసుకొచ్చి కదిలే పుష్పవనంలా తయారుచేసిన పల్లకిపై ఆశీనులను చేశారు. మంగళ వాయిద్యాలు, భాజాభజంత్రీల నడుమ కాణిపాక పురవీధుల్లో ఊరేగించారు.ఈవో పెంచల కిషోర్, ఏఈవోలు ఎస్వీ కృష్ణారెడ్డి, రవీంద్రబాబు, సూపరింటెండెంట్లు శ్రీధర్‌బాబు, కోదండపాణి, ఆలయ ఇన్‌స్పెక్టర్లు బాలాజీనాయుడు, చిట్టిబాబు, ఉభయదారులు పాల్గొన్నారు.ప్రత్యేక ఉత్సవాల్లో ఆదివారం రాత్రి కామధేను వాహన సేవను నిర్వహించనున్నారు.