నేడు అమ్మవారికి గజవాహనసేవ
ABN , Publish Date - Nov 21 , 2025 | 01:04 AM
తిరుచానూరు పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి గజవాహన సేవ జరగనుంది. తిరుమలలో శ్రీవారి గరుడసేవకున్న ప్రాముఖ్యత.. తిరుచానూరులో గజవాహనసేవకు ఉంటుంది. తిరుపతి నగరంతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు గజవాహన సేవ తిలకించేందుకు పెద్దసంఖ్యలో తరలివస్తారు. దీంతో మాడవీధుల్లో ఎలాంటి తొక్కిసలాటలు, తోపులాటలు చోటుచేసుకోకుడా టీటీడీ ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేసింది. టీటీడీ జేఈవో వీరబ్రహ్మం, సీవీఎస్వో మురళీకృష్ణ ఆలయ మాడవీధుల్లో గజవాహన సేవ ఏర్పాట్లు పరిశీలించారు. ఎక్కడా భక్తులు ఇబ్బంది పడకుండా పోలీసు, విజిలెన్సు సమన్వయంతో పనిచేయాలన్నారు. భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. స్కౌట్స్ అండ్ గైడ్స్, శ్రీవారి సేవకుల సేవలను వినియోగించుకుంటున్నారు. ప్రతిరోజు వాహన సేవలు రాత్రి 9 గంటలకు ముగిస్తే, గజ, గరుడ వాహనసేవలకు మాత్రం రాత్రి 11గంటల వరకు వాహనసేవ కొనసాగే అవకాశం ఉంది. తిరుమల నుంచి లక్ష్మీకాసుల హారం రాక గజవాహన సేవ నేపథ్యంలో అమ్మవారికి అలంకరించేందుకు తిరుమలలో శ్రీవారికి అలంకరించే సహస్ర లక్ష్మీకాసుల హారాన్ని శుక్రవారం ఉదయం తీసుకురానున్నారు. ఈ హారాన్ని శోభాయాత్రగా తీసుకొచ్చి.. గజవాహన సేవలో అమ్మవారికి అలంకరిస్తారు.
తిరుచానూరు, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): తిరుచానూరు పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి గజవాహన సేవ జరగనుంది. తిరుమలలో శ్రీవారి గరుడసేవకున్న ప్రాముఖ్యత.. తిరుచానూరులో గజవాహనసేవకు ఉంటుంది. తిరుపతి నగరంతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు గజవాహన సేవ తిలకించేందుకు పెద్దసంఖ్యలో తరలివస్తారు. దీంతో మాడవీధుల్లో ఎలాంటి తొక్కిసలాటలు, తోపులాటలు చోటుచేసుకోకుడా టీటీడీ ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేసింది. టీటీడీ జేఈవో వీరబ్రహ్మం, సీవీఎస్వో మురళీకృష్ణ ఆలయ మాడవీధుల్లో గజవాహన సేవ ఏర్పాట్లు పరిశీలించారు. ఎక్కడా భక్తులు ఇబ్బంది పడకుండా పోలీసు,
విజిలెన్సు సమన్వయంతో పనిచేయాలన్నారు. భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. స్కౌట్స్ అండ్ గైడ్స్, శ్రీవారి
సేవకుల సేవలను వినియోగించుకుంటున్నారు. ప్రతిరోజు వాహన సేవలు రాత్రి 9 గంటలకు ముగిస్తే, గజ, గరుడ వాహనసేవలకు మాత్రం రాత్రి 11గంటల వరకు వాహనసేవ కొనసాగే అవకాశం ఉంది.
తిరుమల నుంచి లక్ష్మీకాసుల హారం రాక
గజవాహన సేవ నేపథ్యంలో అమ్మవారికి అలంకరించేందుకు తిరుమలలో శ్రీవారికి అలంకరించే సహస్ర లక్ష్మీకాసుల హారాన్ని శుక్రవారం ఉదయం తీసుకురానున్నారు. ఈ హారాన్ని శోభాయాత్రగా తీసుకొచ్చి.. గజవాహన సేవలో అమ్మవారికి అలంకరిస్తారు.