Share News

పంట పొలాలపై ‘గజ’దాడులు

ABN , Publish Date - Oct 12 , 2025 | 01:32 AM

మండలంలోని యల్లంపల్లె గ్రామ అటవీ ప్రాంత సమీప పంట పొలాలపై శుక్రవారం రాత్రి ఏనుగులు దాడి చేశాయి. సాయంత్రం 6 గంటలకు ఏనుగుల గుంపు పులిచెర్ల అడవుల్లో నుంచి యల్లంపల్లె అటవీ ప్రాంతంలోకి చొరబడ్డాయి.

పంట పొలాలపై ‘గజ’దాడులు
పొలాల్లో తిరుగుతున్న ఏనుగులు

చంద్రగిరి, అక్టోబరు 11(ఆంధ్రజ్యోతి): మండలంలోని యల్లంపల్లె గ్రామ అటవీ ప్రాంత సమీప పంట పొలాలపై శుక్రవారం రాత్రి ఏనుగులు దాడి చేశాయి. సాయంత్రం 6 గంటలకు ఏనుగుల గుంపు పులిచెర్ల అడవుల్లో నుంచి యల్లంపల్లె అటవీ ప్రాంతంలోకి చొరబడ్డాయి. రాత్రి 9 గంటల సమయంలో 8 ఏనుగులు పంట పొలాలపై దాడులు చేస్తుండటంతో గ్రామస్తులు అటవీ అధికారులకు సమాచారం అందించారు. అటవీ అధికారులు, గ్రామస్తులు కలిసి ఏనుగులు గ్రామంలోకి రాకుండా బాణసంచా పేల్చుతూ, డప్పులు వాయించారు. జ్ఞానప్రకా్‌షరెడ్డికి చెందిన వరి పైరును పూర్తిగా ధ్వంసం చేశాయి. పక్క పొలంలో ఇరిగేషన్‌ పైపులను ధ్వంసం చేశాయి. శనివారం వేకువజాము వరకు అవి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే తిరుగుతుండటంతో యల్లంపల్లె గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. కోతకు సిద్ధంగా ఉన్న పంటలను నాశనం చేస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏనుగుల గుంపు ఇటువైపు రాకుండా అడ్డుకోవడానికి అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.

Updated Date - Oct 12 , 2025 | 01:32 AM