Share News

వచ్చేనెల 1 నుంచీ కూర్చుని తాగండి బాబూ!

ABN , Publish Date - Aug 20 , 2025 | 01:42 AM

పాపం.. మందుబాబులు అందరూ బార్లకు వెళ్లి తాగలేరు కదా! కొందరు షాపుల్లో సీసాలు కొనుక్కుని అక్కడే నిలబడి గుటుక్కున గొంతులో పోసేసుకుంటుంటారు. మరికొందరు ఏ సందుగొందుల్లోనో చాటుకు చేరి గబగబా లాగించేస్తుంటారు. కాస్త నిమ్మళంగా తాగాలనుకునేవాళ్లకి ఊరిచివర పాడుబడిన భవనాలూ, ముళ్లకంపలే దిక్కు. ఈ కష్టం చూడలేక ప్రభుత్వం తాజాగా పర్మిట్‌ రూములకు అనుమతులు ప్రకటించింది. పైకి ఎన్ని మాటలు చెప్పినా.. ప్రభుత్వ ఆదాయాన్ని ఇబ్బడి ముబ్బడిగా పెంచేది వీరే కదా మరి! ఏ ప్రభుత్వానికైనా ప్రియమైనవారు వీరే. ఇక వీరికి షాపుల దగ్గర నిలబడి తాగే అవసరం ఉండదు. సెప్టెంబరు 1 నుంచీ దర్జాగా కూర్చుని మందు లాగించవచ్చు. జిల్లాలో 250 మద్యం షాపులున్నాయి.

వచ్చేనెల 1 నుంచీ  కూర్చుని తాగండి బాబూ!

  • మందుబాబుల కోసం జిల్లాలో 250 మద్యం షాపులకు పర్మిట్‌ రూములు

  • ఏడాదికి రూ.16.82 కోట్ల ఆదాయం

తిరుపతి(నేరవిభాగం), ఆంధ్రజ్యోతి: పాపం.. మందుబాబులు అందరూ బార్లకు వెళ్లి తాగలేరు కదా! కొందరు షాపుల్లో సీసాలు కొనుక్కుని అక్కడే నిలబడి గుటుక్కున గొంతులో పోసేసుకుంటుంటారు. మరికొందరు ఏ సందుగొందుల్లోనో చాటుకు చేరి గబగబా లాగించేస్తుంటారు. కాస్త నిమ్మళంగా తాగాలనుకునేవాళ్లకి ఊరిచివర పాడుబడిన భవనాలూ, ముళ్లకంపలే దిక్కు. ఈ కష్టం చూడలేక ప్రభుత్వం తాజాగా పర్మిట్‌ రూములకు అనుమతులు ప్రకటించింది. పైకి ఎన్ని మాటలు చెప్పినా.. ప్రభుత్వ ఆదాయాన్ని ఇబ్బడి ముబ్బడిగా పెంచేది వీరే కదా మరి! ఏ ప్రభుత్వానికైనా ప్రియమైనవారు వీరే. ఇక వీరికి షాపుల దగ్గర నిలబడి తాగే అవసరం ఉండదు. సెప్టెంబరు 1 నుంచీ దర్జాగా కూర్చుని మందు లాగించవచ్చు. జిల్లాలో 250 మద్యం షాపులున్నాయి. వీరంతా ఇక పర్మిట్‌ రూములు ఏర్పాటు చేసుకోవచ్చు. కాకపోతే ప్రభుత్వం నిర్ణయించిన రుసుము చెల్లించాలి. అమ్మకాలను బట్టీ షాపులకు రెండు రకాల శ్లాబులు నిర్ణయించారు. ఏడాదికి రూ.55 లక్షల లోపు మద్యం అమ్మేవాళ్లు రూ.5 లక్షలు ఏడాదికి చెల్లించాలి. ఈ శ్లాబు కింద 55 షాపులున్నాయి. ఇక రూ.65 లక్షలు దాకా అమ్ముతుంటే రూ.7.50 లక్షలు నిర్ణయించారు. ఈ శ్లాబులో జిల్లాలో 173 షాపులున్నాయి. ప్రస్తుతం సెప్టెంబరు, అక్టోబరు నెలలకు మాత్రమే పర్మిట్‌ రూములకు రుసుము నిర్ణయించారు. ఆ తర్వాత ఏడాదికి వసూలు చేస్తారు. రెండు నెలల కాలానికే ప్రభుత్వానికి రూ.2.80 కోట్లు ఆదాయం సమకూరనుంది. ఏడాదికి 16.82 కోట్లు వస్తుందని అంచనా. ఇక పర్మిట్‌ రూము తాగడానికే పరిమితం. ఇక్కడ వంట పదార్థాలు తయారు చేయడానికి లేదు. షాపు వేళల్లోనే వీటినీ తెరవాలి.

Updated Date - Aug 20 , 2025 | 01:43 AM