ఇక నుంచి డీఆర్‌సీ సమావేశాలకు కార్పొరేషన్ చైర్మన్లు
ABN , Publish Date - Dec 04 , 2025 | 01:41 AM
ఇక నుంచి వివిధ కార్పొరేషన్ల చైర్మన్లకు జిల్లా సమీక్షా మండలి సమావేశాలకు హాజరయ్యే అవకాశం లభించనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకూ జిల్లా సమీక్షా మండలి సమావేశాలకు ఆయా జిల్లాల పరిధిలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్లు, మేయర్లు, మున్సిపల్, అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు మాత్రమే పాల్గొనేందుకు వీలుండేది. ఇపుడు అదనంగా జిల్లా పరిధిలోని వివిధ కార్పొరేషన్ల చైర్మన్లకు కూడా ప్రత్యేక ఆహ్వానితుల హోదాలో పాల్గొనేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. వారిని సమావేశాలకు ప్రత్యేక ఆహ్వానితుల హోదాలో ఆహ్వానించాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది. ప్రభుత్వ తాజా ఉత్తర్వులతో జిల్లా పరిధిలోని ఏపీ యాదవ కార్పొరేషన్ చైర్మన్ జి.నరసింహ యాదవ్, ఏపీ గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ ఛైర్‌పర్సన్ సుగుణమ్మ, ఏపీ నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ రుద్రకోటి సదాశివం, ఏపీ హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్ కూడా డీఆర్సీ సమావేశాల్లో పాల్గొననున్నారు. నిబంధనల ప్రకారం రెండు నెలలకొకసారి విధిగా డీఆర్సీ సమావేశం నిర్వహించాలని కూడా ప్రభుత్వం జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది.
ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరయ్యే అవకాశం
తిరుపతి, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): ఇక నుంచి వివిధ కార్పొరేషన్ల చైర్మన్లకు జిల్లా సమీక్షా మండలి సమావేశాలకు హాజరయ్యే అవకాశం లభించనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకూ జిల్లా సమీక్షా మండలి సమావేశాలకు ఆయా జిల్లాల పరిధిలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్లు, మేయర్లు, మున్సిపల్, అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు మాత్రమే పాల్గొనేందుకు వీలుండేది. ఇపుడు అదనంగా జిల్లా పరిధిలోని వివిధ కార్పొరేషన్ల చైర్మన్లకు కూడా ప్రత్యేక ఆహ్వానితుల హోదాలో పాల్గొనేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. వారిని సమావేశాలకు ప్రత్యేక ఆహ్వానితుల హోదాలో ఆహ్వానించాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది. ప్రభుత్వ తాజా ఉత్తర్వులతో జిల్లా పరిధిలోని ఏపీ యాదవ కార్పొరేషన్ చైర్మన్ జి.నరసింహ యాదవ్, ఏపీ గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ ఛైర్‌పర్సన్ సుగుణమ్మ, ఏపీ నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ రుద్రకోటి సదాశివం, ఏపీ హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్ కూడా డీఆర్సీ సమావేశాల్లో పాల్గొననున్నారు. నిబంధనల ప్రకారం రెండు నెలలకొకసారి విధిగా డీఆర్సీ సమావేశం నిర్వహించాలని కూడా ప్రభుత్వం జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది.