ఉచితం.... బస్సు ప్రయాణం
ABN , Publish Date - Aug 16 , 2025 | 01:48 AM
స్ర్తీ శక్తి పథకానికి వేడుకగా ప్రారంభోత్సవం
చిత్తూరు అర్బన్/ఐరాల(కాణిపాకం), ఆగస్టు 15(ఆంధ్రజ్యోతి): సూపర్‌సిక్స్ హామీల్లో ఒకటైన మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ అవకాశం కల్పించే స్ర్తీ శక్తి పథకాన్ని శుక్రవారం సాయంత్రం చిత్తూరు ఆర్టీసీ బస్టాండ్‌లో మంత్రి సత ్యకుమార్ ప్రారంభించారు.ప్రత్యేకంగా అలకరించిన రెండు ఆర్టీసీ బస్సుల్లో పలువురు మహిళలతో కలసి మంత్రి సత్యకుమార్, ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, ఎమ్మెల్యే జగన్మోహన్, కలెక్టర్ సుమిత్‌కుమార్,చుడా చైర్‌పర్సన్ కఠారి హేమలత, మేయర్ అముద,మాజీ ఎమ్మెల్సీ దొరబాబు,మాజీ ఎమ్మెల్యే ఏఎస్ మనోహర్ తదితరులు చిత్తూరు ఆర్టీసీ బస్టాండ్ నుంచి కాణిపాకం వెళ్లారు. వరసిద్ధుడిని దర్శించుకుని బస్సులకు పూజలు చేయించారు. ఐరాల మండలంలోని అగరంపల్లె ఆర్చి వద్ద మరోసారి ఆర్టీసీ బస్సును మంత్రి ఎంపీ ప్రసాదరావు, ఎమ్మెల్యేలు మురళీమోహన్, జగన్మోహన్‌లతో కలిసి ప్రారంభించారు.అనంతరం తిరిగి చిత్తూరుకు బస్సుల్లోనే చేరుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను సీఎం చంద్రబాబు ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారని చెప్పారు.చిత్తూరు పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు సీఆర్ రాజన్, ప్రధాన కార్యదర్శి కోదండయాదవ్, జడ్పీటీసీ సుచిత్ర, టీడీపీ మండల అధ్యక్షుడు హరిబాబు నాయుడు, నియోజకవర్గ పోల్‌మేనేజ్‌మెంట్ కన్వీనర్ గిరిధర్‌బాబు, మాజీ జడ్పీటీసీ లత, కాణిపాక ఆలయ మాజీ చైర్మన్ మణినాయుడు, నాయకులు మధుసూదనరావు, పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.