Share News

నలుగురికి సిల్వర్‌..12 మందికి బ్రాంజ్‌

ABN , Publish Date - Dec 23 , 2025 | 12:30 AM

విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన పలువురు పోలీసులకు రాష్ట్ర ప్రభుత్వం అవార్డులు ప్రకటించింది.

నలుగురికి సిల్వర్‌..12 మందికి బ్రాంజ్‌

తిరుపతి(నేరవిభాగం), డిసెంబరు 22(ఆంధ్రజ్యోతి): విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన పలువురు పోలీసులకు రాష్ట్ర ప్రభుత్వం అవార్డులు ప్రకటించింది. ఇందులో జిల్లాకు చెందిన ఐదుగురు సిల్వర్‌ పతకానికి ఎంపికయ్యారు. 12 మంది బ్రాంజ్‌ పతకాలు దక్కించుకున్నారు.

సిల్వర్‌ మెడల్స్‌ ఎంపికైన వారు..

ప్రభుత్వం ప్రకటించిన డీజీపీ సిల్వర్‌ డిస్క్‌ పతకానికి గాజులమండ్యం స్టేషన్‌లో హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న పి.ధనంజయ, తిరుపతి ఎస్పీ కార్యాలయ అదనపు ఎస్పీ (అడ్మిన్‌)గా పనిచేస్తున్న వెంకట్రావు, వెంకటగిరిలోని ఏపీఎస్పీ తొమ్మిదో బెటాలియన్‌ ఆర్‌ఎ్‌సఐ కోటయ్య, తిరుపతి ఎర్రచందనం టాస్క్‌ఫోర్సులో సీఐగా పనిచేస్తున్న సురే్‌షకుమార్‌ ఎంపికయ్యారు.

12 మందికి బ్రాంజ్‌ మెడల్స్‌

జిల్లా నుంచి 12 మంది పోలీసులకు బ్రాంజ్‌ పతకాలు వచ్చాయి. వీరిలో రేణిగుంట డీఎస్పీ శ్రీనివాసరావు, సీసీఎస్‌ సీఐ ప్రకా్‌షరావు, నారాయణవనం ఎస్‌ఐ కే రాజశేఖర్‌, రేణిగుంట ఏఎ్‌సఐ జిలానీపీరా ఉన్నారు. వీరితోపాటు వివిధ స్టేషన్లలో కానిస్టేబుళ్లుగా పనిచేస్తున్న బి.మునిరాజ (మహిళా పీఎస్‌), ఎం.గుణశేఖర్‌(డీసీఆర్‌బీ, తిరుపతి), పి.పార్థసారథి(మహిళా స్టేషన్‌), టి.ప్రభాకర్‌(తిరుచానూరు), మనోహరరెడ్డి (గాజులమండ్యం), ఓంకార్‌(కేవీబీపురం), పి.హేమంత్‌కుమార్‌(రేణిగుంట), కే నాగేంద్ర(గూడూరు టూటౌన్‌) ఉన్నారు.

Updated Date - Dec 23 , 2025 | 12:30 AM