Share News

ఈతకు వెళ్లిన నలుగురి గల్లంతు

ABN , Publish Date - Oct 25 , 2025 | 01:26 AM

తిరుపతిరూరల్‌ మండలం వేదాంతపురం అగ్రహారానికి చెందిన మంజుల, మునస్వామిరెడ్డి దంపుతులకు బాలు, తేజు కుమారులు. చిన్నకుమారుడు బాలు పుట్టినరోజు కావడంతో శుక్రవారం పాఠశాలకు వెళ్లలేదు. మరో ఐదుగురు స్నేహితులతో కలసి సరదాగా ఈతకని స్వర్ణముఖి నదిలోకి వెళ్లారు. సాయంత్రం 4.30గంటలకి నదిలోని ఇసుకదిబ్బలపై ఆడుతూ స్నానం చేస్తున్న సమయంలో అకస్మాతుగా పెరిగిన నీటిప్రవాహానికి ప్రకాశ్‌(17), మునిచంద్ర అలియాస్‌ చిన్న(15), తేజు(19), బాలు(16) కొట్టుకుపోగా.. కృష్ణ, విష్ణు, మునికృష్ణ బయటపడ్డారు. ఈ ముగ్గురిలో ఒకరు నదిమధ్యలో చెట్టును పట్టుకుని వేలాడుతుండగా, అటువైపు వచ్చిన యువకుడు ఒడ్డుకు చేర్చారని, మిగిలిన ఇద్దరు ఇసుకదిబ్బపై నిలబడి ఉన్నారని తెలిసింది. గల్లంతైన ముగురు బాలురకోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈతకు వెళ్లిన బాలురుల్లో ఒకరు 100కి డయల్‌ చేయడంతో రక్షణ సిబ్బంది, గాలింపుబృందాలు నదిలోకి దిగి చర్యలు చేపట్టగా బాలు మృతదేహం బయటపడింది.

ఈతకు వెళ్లిన నలుగురి గల్లంతు
ప్రమాదం జరిగింది ఈ ఇసుక దిబ్బ వద్దే

  • ఒకరి మృతదేహం లభ్యం.. ఆచూకీ లభించని మరో ముగ్గురు

  • చీకటి, వర్షంతో గాలింపుబృందాలు వెనక్కి

  • వేదాంతపురంలో విషాదం

ఒకరి పుట్టిన రోజు. సరదాగా ఈతకని వెళ్లారు. ఆ తర్వాత వచ్చి కేకు కట్‌ చేద్దామని ప్లాన్‌ చేసుకున్నారు. స్వర్ణముఖి నదిలోని ఇసుక దిబ్బపై ఆడుతూ.. నీళ్లలో దూకుతూ ఉల్లాసంగా గడుపుతున్నారు. ఆ సమయంలో పెరిగిన నీటి ప్రవాహంతో నలుగురు గల్లంతయ్యారు. వీరిలో ఒకరు చనిపోయారు. మిగతా ముగ్గురి ఆచూకీ దొరకలేదు. ఈ విషాదం తిరుపతి రూరల్‌లో చోటుచేసుకుంది.

తిరుపతిరూరల్‌, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): తిరుపతిరూరల్‌ మండలం వేదాంతపురం అగ్రహారానికి చెందిన మంజుల, మునస్వామిరెడ్డి దంపుతులకు బాలు, తేజు కుమారులు. చిన్నకుమారుడు బాలు పుట్టినరోజు కావడంతో శుక్రవారం పాఠశాలకు వెళ్లలేదు. మరో ఐదుగురు స్నేహితులతో కలసి సరదాగా ఈతకని స్వర్ణముఖి నదిలోకి వెళ్లారు. సాయంత్రం 4.30గంటలకి నదిలోని ఇసుకదిబ్బలపై ఆడుతూ స్నానం చేస్తున్న సమయంలో అకస్మాతుగా పెరిగిన నీటిప్రవాహానికి ప్రకాశ్‌(17), మునిచంద్ర అలియాస్‌ చిన్న(15), తేజు(19), బాలు(16) కొట్టుకుపోగా.. కృష్ణ, విష్ణు, మునికృష్ణ బయటపడ్డారు. ఈ ముగ్గురిలో ఒకరు నదిమధ్యలో చెట్టును పట్టుకుని వేలాడుతుండగా, అటువైపు వచ్చిన యువకుడు ఒడ్డుకు చేర్చారని, మిగిలిన ఇద్దరు ఇసుకదిబ్బపై నిలబడి ఉన్నారని తెలిసింది. గల్లంతైన ముగురు బాలురకోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈతకు వెళ్లిన బాలురుల్లో ఒకరు 100కి డయల్‌ చేయడంతో రక్షణ సిబ్బంది, గాలింపుబృందాలు నదిలోకి దిగి చర్యలు చేపట్టగా బాలు మృతదేహం బయటపడింది. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తినానీ ఘటనా స్థలానికి చేరుకుని ఆర్డీవో రామ్మోహన్‌, ఏఎస్పీ రవిమనోహరాచారిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. స్థానికుల ద్వారా పిల్లల వివరాలు అడిగి తెలుసుకున్నారు. సీఎం చంద్రబాబునాయుడు, ఇన్‌చార్జి మంత్రికి ఫోన్‌ ద్వారా సమాచారమిచ్చామని, సీఎం ద్రిగ్భాంతిని వ్యక్తం చేశారని నాని తెలిపారు. వైసీపీప్రభుత్వంలో స్వర్ణముఖినదిలో ఎక్కడపడితే అక్కడ ఇసుకతవ్వకాలు చేపట్టడంతో భారీగుంతలు ఏర్పడ్డాయని, నదిలో ఇసుకరవాణాకు దారి లేకుండా అన్ని దారులు మూసేసేలా చర్యలు చేపడతామన్నారు. తిరుపతిరూరల్‌ తహసీల్దార్‌ రామాంజులనాయక్‌, రూరల్‌ పోలీసులు, తదితరులు పాల్గొన్నారు. ఒకవైపు చీకటి పడటం, వర్షం కురుస్తుండటంతో గాలింపు బృందాలు వెనక్కి వచ్చాయి. మరోపక్క పోలీసులు డ్రోన్‌ ద్వారా పర్యవేక్షించారు. కాగా, బాపట్ల నుంచి రెస్క్యూ టీమ్‌ ఇక్కడికి వచ్చింది. శనివారం వేకువన 5 గంటల నుంచి గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, వీరిలో ఇద్దరు ఎమ్మార్‌పల్లె జెడ్పీ హైస్కూల్‌లో పదో తరగతి.. మరో ఇద్దరు ఇంటర్‌ చదువుతున్నట్లు సమాచారం. ఈఘటనపై జిల్లా కలెక్టర్‌ తీవ్ర దిగ్ర్బాంతిని వ్యక్తం చేశారు. గల్లంతైన విద్యార్థులకోసం తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

తమ్ముడిని కాపాడబోయి అన్న గల్లంతు

తేజు, బాలు అన్నదమ్ములు. తేజు సాయంత్రం 4.20గంటల సమయంలో స్వర్ణముఖి సమీపంలో జీవాలను తోలుకొచ్చి మేపుతూ స్థానికులతో మాట్లాడారని అంటున్నారు. నదిలో పెద్దగా కేకలు వినబడడంతో అటువైపుగా వెళ్లి తమ్ముడు బాలును రక్షించబోయి గల్లంతయ్యాడని భావిస్తున్నారు. పెద్దకుమారుడు గల్లంతవడం.. చిన్న కుమారుడు పుట్టినరోజే చనిపోవడంతో మంజుల దంపతులు బోరున విలపించారు. వీరిని ఓదార్చడం ఎవరివల్ల కాలేదు.

డిప్యూటీ సీఎం దిగ్ర్భాంతి

తిరుపతి(కలెక్టరేట్‌), అక్టోబరు 24(ఆంధ్రజ్యోతి): వేదాంతపురం ఘటనపై డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఽఢసానుభూతి తెలియజేస్తున్నట్లు ప్రకటనలో తెలిపారు. సహాయక చర్యలనుచేపట్టాలని అధికారులను ఆదేశించారు. నదులు, వాగులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో ఈతకువెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు.

Updated Date - Oct 25 , 2025 | 01:26 AM