నేడు నాలుగు డీడీవో కార్యాలయాల ప్రారంభం
ABN , Publish Date - Dec 04 , 2025 | 01:44 AM
స్థానిక సంస్థలను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాలనాపరమైన ఫలితాలు ప్రజలకు చేరువ చేసేలా వీలైనన్ని డీడీవో కార్యాలయాలను ప్రారంభిస్తోంది. ఇందులో భాగంగా జిల్లాలో గూడూరు, శ్రీకాళహస్తి, సూళ్లూరుపేట, తిరుపతిలో కార్యాలయాలను గురువారం డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ చిత్తూరు నుంచి వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు. ఆయా నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు. ఇకపై రెవెన్యూ శాఖలో డివిజనల్ స్థాయిలో ఆర్డీవోలు మాదిరిగా డీడీవోలే అభివృద్ధి పనులను పర్యవేక్షించనున్నారు. డ్వామా ఏపీడీ, డీఎల్‌పీవోలు డీడీవోల పరిధిలో పనిచేస్తారు. తిరుపతి డివిజన్ డీడీవోగా నారాయణరెడ్డి వ్యవహరిస్తున్నారు. మిగిలిన మూడుచోట్ల డీఎల్‌పీవోలు లేరు. డీడీవోలు డీఎల్‌పీవోలుగా వ్యవహరిస్తున్నారు. గూడూరుకు వాణి, శ్రీకాళహస్తికి సుస్మిత, సూళ్లూరుపేటకు జాలిరెడ్డి వ్యవహరిస్తున్నారు.
తిరుపతి(కలెక్టరేట్), డిసెంబరు 3(ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థలను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాలనాపరమైన ఫలితాలు ప్రజలకు చేరువ చేసేలా వీలైనన్ని డీడీవో కార్యాలయాలను ప్రారంభిస్తోంది. ఇందులో భాగంగా జిల్లాలో గూడూరు, శ్రీకాళహస్తి, సూళ్లూరుపేట, తిరుపతిలో కార్యాలయాలను గురువారం డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ చిత్తూరు నుంచి వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు. ఆయా నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు. ఇకపై రెవెన్యూ శాఖలో డివిజనల్ స్థాయిలో ఆర్డీవోలు మాదిరిగా డీడీవోలే అభివృద్ధి పనులను పర్యవేక్షించనున్నారు. డ్వామా ఏపీడీ, డీఎల్‌పీవోలు డీడీవోల పరిధిలో పనిచేస్తారు. తిరుపతి డివిజన్ డీడీవోగా నారాయణరెడ్డి వ్యవహరిస్తున్నారు. మిగిలిన మూడుచోట్ల డీఎల్‌పీవోలు లేరు. డీడీవోలు డీఎల్‌పీవోలుగా వ్యవహరిస్తున్నారు. గూడూరుకు వాణి, శ్రీకాళహస్తికి సుస్మిత, సూళ్లూరుపేటకు జాలిరెడ్డి వ్యవహరిస్తున్నారు.