జనసేన మాజీ ఇన్‌చార్జి వినుతకు షరతులతో కూడిన బెయిల్
ABN , Publish Date - Aug 09 , 2025 | 01:48 AM
డ్రైవరు కమ్ పీఏ హత్య కేసులో శ్రీకాళహస్తి జనసేన మాజీ ఇన్‌చార్జి కోట వినుతకు బెయిల్ మంజూరైంది.
చెన్నై, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి) : డ్రైవరు కమ్ పీఏ హత్య కేసులో శ్రీకాళహస్తి జనసేన మాజీ ఇన్‌చార్జి కోట వినుతకు బెయిల్ మంజూరైంది.గత నెల 7వ తేదీన డ్రైవరు రాయుడు అలియాస్ శ్రీనివా్‌సను చంపి మృతదేహాన్ని గోనెసంచిలో మూటకట్టి చెన్నై సమీపంలోని కువ్వా నది కాలువలో పడవేసినట్లు వినుత, ఆమె భర్త చంద్రబాబు సహా మరో ముగ్గురిపై చెన్నై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.ఈ కేసులో వినుతకు చెన్నై కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.రోజూ ఉదయం 10గంటల్లోపు చెన్నైలోని సెవెన్‌హిల్స్ పోలీసు స్టేషన్‌లో సంతకం చేయాలని కోర్టు షరతు విధించింది.