జిల్లా, మండల, గ్రామ స్థాయుల్లో వన మహోత్సవాలు
ABN , Publish Date - Oct 22 , 2025 | 11:29 PM
జిల్లా, మండల, గ్రామ స్థాయిల్లో వన మహోత్సవ కార్యక్రమాలను నిర్వహిస్తామని కలెక్టర్ సుమిత్‌కుమార్ తెలిపారు.
చిత్తూరు కలెక్టరేట్, అక్టోబరు 22(ఆంధ్రజ్యోతి): త్వరలో రాష్ట్ర స్థాయి వలే జిల్లా, మండల, గ్రామ స్థాయిల్లో వన మహోత్సవ కార్యక్రమాలను నిర్వహిస్తామని కలెక్టర్ సుమిత్‌కుమార్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లోని మీటింగ్ హాలులో హరిత ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పచ్చదనాన్ని పెంపొందించే దిశగా జిల్లా అంత టా వ్యవసాయ, వ్యవసాయేతర, ప్రైవేటు భూములు, రహదారుల వెంబడి, కాలువ గట్లు, రైల్వే పట్టాలు, రెవెన్యూ భూములు, పరిశ్రమలు, ప్రభుత్వ సముదాయాలు, బంజరు భూములు, చెరువుల సమీపాల్లో విరివిగా మొక్కలు నాటాలన్నారు. మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో ఉద్యాన వనాలు, నగర వనాలు, గ్రామాలవారీగా పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ రోడ్లు, కాలువలు, ట్యాంక్‌బండ్లపై అందుబాటులో ఉన్న బంజరు భూముల్లో మొక్కల పెంపకాన్ని చేపట్టాలన్నారు. డీఎ్‌పవో జ్ఞాన ప్రకా్‌షరాజు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ అడవుల పరిరక్షణలో మమేకమై ప్రజా ఉద్యమంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడతామని చెప్పారు. ఈ సమావేశంలో జడ్పీ సీఈవో రవికుమార్ నాయుడు, డీఆర్‌డీఏ, డ్వామా పీడీలు శ్రీదేవి, రవికుమార్, డీఈవో వరలక్ష్మీ, కమిషనర్లు, వ్యవసాయ, ఆర్‌అండ్‌బీ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.