ఏనుగుల జాడ కోసం.....
ABN , Publish Date - Nov 04 , 2025 | 01:05 AM
పులిచెర్ల మండలం పాళెం పంచాయతీ సరిహద్దులో ఉన్న తూర్పు విభాగం అటవీ ప్రాంతంలో ఏనుగుల గుంపు జాడపై సోమవారం సాయంత్రం డ్రోన్ కెమెరాతో విస్తృతంగా గాలింపు చేపట్టినట్లు ఎఫ్‌ఎ్‌సవోలు మహమ్మద్ షఫి, భారతి, ఎఫ్‌బీవోలు మధు, జమున తెలిపారు.
కల్లూరు, నవంబరు 3(ఆంధ్రజ్యోతి): పులిచెర్ల మండలం పాళెం పంచాయతీ సరిహద్దులో ఉన్న తూర్పు విభాగం అటవీ ప్రాంతంలో ఏనుగుల గుంపు జాడపై సోమవారం సాయంత్రం డ్రోన్ కెమెరాతో విస్తృతంగా గాలింపు చేపట్టినట్లు ఎఫ్‌ఎ్‌సవోలు మహమ్మద్ షఫి, భారతి, ఎఫ్‌బీవోలు మధు, జమున తెలిపారు. ఆదివారం రాత్రి పాళెం పంచాయతీ కోటపల్లి వద్ద ఏనుగుల మంద పంటలకు అపారనష్టం కలిగించడంతో అటవీశాఖ అధికారులు వాటి కట్టడికి డ్రోన్ తీసుకొచ్చారు. చిత్తూరు ఈస్ట్ రేంజ్, తిరుపతి జిల్లా పనపాకం రేంజ్ పరిధిలోని అధికారులు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టారు. అయితే చీకటిపడే సమయానికి అడవిలో ఏనుగుల జాడను డ్రోన్ కెమెరాలు గుర్తించలేక పోవడంతో అధికారులు వెనుదిరిగారు.