Share News

30 నుంచి 50 పడకలకు

ABN , Publish Date - Aug 22 , 2025 | 02:56 AM

రాష్ట్ర ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్వగ్రామమైన చంద్రగిరి మండలం నారావారిపల్లిలో ప్రభుత్వాసుపత్రి స్థాయి పెరిగింది.

30 నుంచి 50 పడకలకు

నారావారిపల్లె ప్రభుత్వాస్పత్రి స్థాయి పెంచుతూ మంత్రిమండలి నిర్ణయం

తిరుపతి, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్వగ్రామమైన చంద్రగిరి మండలం నారావారిపల్లిలో ప్రభుత్వాసుపత్రి స్థాయి పెరిగింది. ఆ మేరకు గురువారం అమరావతిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రిమండలి నిర్ణయించింది. ఏపీ వైద్య విధాన పరిషత్‌ నియంత్రణలో నడుస్తున్న ఈ ఆస్పత్రి ఇప్పటి వరకూ 30 పడకల స్థాయిలో వుంది. అయితే దాన్ని 50 పడకల స్థాయికి పెంచడంతో పాటు పోస్టుల మంజూరులో ఆర్థిక చిక్కులు ఎదురు కాకుండా ఇప్పటికే మంజూరైన పోస్టుల స్థానంలో 18 అదనపు పోస్టులను సృష్టించేలా వైద్యారోగ్య శాఖ చేసిన ప్రతిపాదనను మంత్రిమండలి ఆమోదించింది. కాగా నారావారిపల్లి ఆస్పత్రి స్థాయి పెంపు వల్ల చంద్రగిరితో పాటు పాకాల, పులిచెర్ల, చిన్నగొట్టిగల్లు తదితర చుట్టుపక్కల మండలాలకు చెందిన సుమారు 56 వేల మంది వైద్యారోగ్య సేవలు పొందనున్నారు.

Updated Date - Aug 22 , 2025 | 02:56 AM