Share News

9 మండలాల్లో ఫ్లోరైడ్‌ ప్రభావం

ABN , Publish Date - May 29 , 2025 | 12:13 AM

పాఠశాలలు ప్రారంభమైన వెంటనే 11 ఏళ్లలోపు పిల్లలకు స్ర్కీనింగ్‌ పరీక్షలు

9 మండలాల్లో ఫ్లోరైడ్‌ ప్రభావం

చిత్తూరు రూరల్‌, మే 28 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని 21 జిల్లాల్లో ఫ్లోరైడ్‌ ప్రభావం ఉంది. ఇందులో మన జిల్లా కూడా ఉందని అధికారులు గుర్తించారు. జిల్లాకు సంబంధించి 9 మండలాల్లోని 15 గ్రామ పంచాయతీలకు చెందిన 21 గ్రామాల్లో ఫ్లోరైడ్‌ సమస్య ఉన్నట్లు గుర్తించారు. అందులో ఏడు పంచాయతీల్లో అధికంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఆయా గ్రామాల్లో జిల్లా అధికారులు వైద్యశిబిరాలు నిర్వహించాలని రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ అధికారులు ఆదేశించారు. అలాగే పాఠశాలలు పునఃప్రారంభమైన వెంటనే 11 ఏళ్లలోపు పిల్లలందరికీ బడుల్లోనే డెంటల్‌ ఫ్లోరోసిస్‌, స్కెలిటల్‌ ఫ్లోరోసిస్‌ స్ర్కీనింగ్‌ పరీక్షలు నిర్వహించాలన్నారు. ఫ్లోరోసిస్‌ అనుమానిత పిల్లలకి మల్టీ విటమిన్‌, కాల్షియం, విటమిన్‌ సీ మాత్రలు అందజేసి, అవసరమైన వారికి వైద్యం చేయాలని సూచించారు. అలాగే స్కెలిటల్‌ ఫ్లోరోసిన్‌ వ్యాధిబారిన పడిన వారికి నెక్‌బెల్ట్‌, వాకింగ్‌ స్టిక్స్‌, వీల్‌ చైర్లు, టాయిలెట్‌ చైర్లు వంటివి అందించాలన్నారు. వ్యాధి తీవ్రత ఎక్కువై.. సర్జరీ అవసరమైతే ఉచితంగా చేయించనున్నట్లు పేర్కొన్నారు.

ఐరాలలో అత్యధికం

తాగునీటిలో బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ (బీఐఎస్‌) లెవల్‌ 1.50 ఉండాల్సి ఉంది. ఐరాల మండలం 35 యర్లంపల్లె పంచాయతీ గుట్టకిందపల్లె హరిజనవాడలో అత్యధికంగా 10.30 బీఐఎస్‌ లెవల్‌ ఉన్నట్లు గుర్తించారు.

బీఐఎస్‌ లెవల్‌ 1.50 దాటిన గ్రామాల వివరాలు

మండలం గ్రామం బీఐఎస్‌

పంచాయతీ లెవల్‌

------------------------------------------------------------------------------

చిత్తూరు రూరల్‌ చెర్లోపల్లె కమ్మపల్లె 2.74

జీడీనెల్లూరు నెల్లేపల్లె కొత్తూరు

(ఏఏడబ్ల్యూ) 1.64

జీడీనెల్లూరు పాపిరెడ్డిపల్లె పెడకంటిపల్లె

(హెచ్‌డబ్ల్యూ) 1.95

జీడీనెల్లూరు తూగుండ్రం దాసరపల్లె 1.69

గుడిపాల బొమ్మసముద్రం బొమ్మసముద్రం

(ఏఏడబ్ల్యూ) 1.60

గుడిపాల మరకాలకుప్పం నాగేంద్రపురం 1.57

గుడిపాల రామభద్రాపురం రామభద్రాపురం

(హెచ్‌డబ్ల్యూ) 1.68

గుడిపాల రామభద్రాపురం రామభద్రాపురం 1.70

ఐరాల 35 యర్లంపల్లె గుట్టకిందపల్లె

(హెచ్‌డబ్ల్యూ) 10.30

పుంగనూరు ఆరడిగుంట అమ్మిగానిపల్లె 1.73

పుంగనూరు ఆరడిగుంట ఆరడిగుంట 1.53

పుంగనూరు ఆరడిగుంట జవ్వుకొత్తూరు 1.52

పుంగనూరు కుమారనత్తం చిన్నగుట్టపల్లె 1.55

పూతలపట్టు చిటిపిరాళ్ల పసుపులేటివారిపల్లె 1.84

పూతలపట్టు వడ్డేపల్లె అమ్మగారిపల్లె 2.02

తవణంపల్లె నల్లిశెట్టిపల్లె నరసింహనపల్లె 1.86

యాదమరి కీనాటంపల్లె కోయివూరు

(హెచ్‌డబ్ల్యూ) 1.80

యాదమరి కీనాటంపల్లె కీనాటంపల్లె

(హెచ్‌డబ్ల్యూ) 1.75

యాదమరి కీనాటంపల్లె కీనాటంపల్లె 1.52

యాదమరి కీనాటంపల్లె కొత్తకాపూరు 1.62

నగరి బీరకుప్పం కన్నికాపురం 1.73

Updated Date - May 30 , 2025 | 03:03 PM