Share News

ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో ఐదేళ్లు జైలు

ABN , Publish Date - Aug 15 , 2025 | 01:36 AM

ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో స్మగ్లర్‌కు ఐదేళ్లు జైలు శిక్ష, రూ.ఆరు లక్షల జరిమానా విధిస్తూ రాష్ట్ర ఎర్రచందనం కోర్టు న్యాయమూర్తి నరసింహమూర్తి గురువారం తీర్పు ఇచ్చారు.

ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో ఐదేళ్లు జైలు

రూ.ఆరు లక్షల జరిమానా

తిరుపతి(నేరవిభాగం), ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో స్మగ్లర్‌కు ఐదేళ్లు జైలు శిక్ష, రూ.ఆరు లక్షల జరిమానా విధిస్తూ రాష్ట్ర ఎర్రచందనం కోర్టు న్యాయమూర్తి నరసింహమూర్తి గురువారం తీర్పు ఇచ్చారు. నాగపట్ల ఈస్ట్‌ బీట్‌ చామలరేంజ్‌ పరిధిలో తమిళనాడు రాష్ట్రం తిరువన్నామలైకి చెందిన చిన్నస్వామి 2020వ సంవత్సరంలో అక్రమంగా ఎర్రచందనం తమిళనాడుకు తరలిస్తుండగా టాస్క్‌ఫోర్సు పోలీసులు, అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తి సాక్ష్యాధారాలు రుజువు కావడంతో నిందితుడికి ఐదేళ్లు జైలుశిక్షతోపాటు రూ.ఆరు లక్షలు జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. నిందితుడిని నెల్లూరు సెంట్రల్‌ జైలుకు తరలించారు.

Updated Date - Aug 15 , 2025 | 01:36 AM