ఐదుగురిపై నేర నిర్ధారణ ఫకఠారి దంపతుల హత్యకేసులో 16మందికి ఉపశమనం
ABN , Publish Date - Oct 25 , 2025 | 01:22 AM
2015 నవంబరు 17వ తేదీన ఉదయం నగరపాలక సంస్థ కార్యాలయంలో అప్పటి మేయర్ కఠారి అనురాధ, ఆమె భర్త మోహన్‌లపై హత్యాయత్నం జరిగింది. ఈ సంఘటనలో అనురాధ అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన మోహన్ సాయంత్రం సీఎంసీ ఆస్పత్రిలో మృతి చెందారు.మోహన్ మేనల్లుడైన శ్రీరామ చంద్రశేఖర్ అలియాస్ చింటూతో పాటు వెంకటాచలపతి, జయప్రకాష్ రెడ్డి, మంజునాథ్, వెంకటేష్, మురుగా, యోగానంద్, పరంధామ, హరిదాస్, చంద్రశేఖర్ అలియాస్ మొగిలి, శశిధర్, ఎం.ఎస్. యోగానంద్, నగేష్ బాబు అలియాస్ ఆర్వీటీ బాబు, లోకేష్, రఘుపతి, నాగరాజు, వెంకట ఆనందకుమార్, కమలాకర్, రజినీకాంత్ అలియాస్ రజిని, నరేంద్ర, శ్రీనివాస ఆచారి, కాసరం రమేష్, టి.జి. సురేష్ అలియాస్ బుల్లెట్ సురేష్‌లపై చిత్తూరు వన్‌టౌన్ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. వీరిలో ప్రధాన నిందితుడైన చింటూ నాల్గవ కోర్టులో 2015, నవంబరు 30వ తేదీన లొంగిపోయాడు. ఆయనకు ఇటీవల సుప్రీం కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.ఏ21గా వున్న శ్రీనివాస ఆచారి విచారణ సమయంలో మృతి చెందాడు. ఏ23గా వున్న శ్రీకాళహస్తివాసి కాసరం రమేష్ ఈ కేసు నుంచి గతంలోనే డిశ్చార్జ్ అయ్యాడు.మిగిలినవారు బెయిల్‌పై బయటకు రాగా జయప్రకాష్ రెడ్డి, మంజునాథ్ చిత్తూరు జైల్లోనే ఉన్నారు. 57మంది సాక్షుల విచారణ
ఫ 27న వెలువడనున్న తుది తీర్పు
చిత్తూరు లీగల్, అక్టోబరు 24 (ఆంరఽధజ్యోతి): చిత్తూరు మొదటి మేయర్ కఠారి అనురాధ దంపతుల హత్యకేసులో ఐదుగురిపై నేరం రుజువైందని చిత్తూరు న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. ప్రధాన నిందితుడు శ్రీరామచంద్రశేఖర్ అలియాస్ చింటూతో పాటు మరో నలుగురిపై నేరం రుజువైందని న్యాయమూర్తి శ్రీనివాసరావు వెల్లడించారు. మిగిలినవారిపై నేరం రుజువు కాకపోవడంతో వారిని నిర్దోషులుగా నిర్ధారించి విడుదల చేశారు.
కేసు వివరాలివీ
2015 నవంబరు 17వ తేదీన ఉదయం నగరపాలక సంస్థ కార్యాలయంలో అప్పటి మేయర్ కఠారి అనురాధ, ఆమె భర్త మోహన్‌లపై హత్యాయత్నం జరిగింది. ఈ సంఘటనలో అనురాధ అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన మోహన్ సాయంత్రం సీఎంసీ ఆస్పత్రిలో మృతి చెందారు.మోహన్ మేనల్లుడైన శ్రీరామ చంద్రశేఖర్ అలియాస్ చింటూతో పాటు వెంకటాచలపతి, జయప్రకాష్ రెడ్డి, మంజునాథ్, వెంకటేష్, మురుగా, యోగానంద్, పరంధామ, హరిదాస్, చంద్రశేఖర్ అలియాస్ మొగిలి, శశిధర్, ఎం.ఎస్. యోగానంద్, నగేష్ బాబు అలియాస్ ఆర్వీటీ బాబు, లోకేష్, రఘుపతి, నాగరాజు, వెంకట ఆనందకుమార్, కమలాకర్, రజినీకాంత్ అలియాస్ రజిని, నరేంద్ర, శ్రీనివాస ఆచారి, కాసరం రమేష్, టి.జి. సురేష్ అలియాస్ బుల్లెట్ సురేష్‌లపై చిత్తూరు వన్‌టౌన్ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. వీరిలో ప్రధాన నిందితుడైన చింటూ నాల్గవ కోర్టులో 2015, నవంబరు 30వ తేదీన లొంగిపోయాడు. ఆయనకు ఇటీవల సుప్రీం కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.ఏ21గా వున్న శ్రీనివాస ఆచారి విచారణ సమయంలో మృతి చెందాడు. ఏ23గా వున్న శ్రీకాళహస్తివాసి కాసరం రమేష్ ఈ కేసు నుంచి గతంలోనే డిశ్చార్జ్ అయ్యాడు.మిగిలినవారు బెయిల్‌పై బయటకు రాగా జయప్రకాష్ రెడ్డి, మంజునాథ్ చిత్తూరు జైల్లోనే ఉన్నారు.
57మంది సాక్షుల విచారణ
ఈ కేసుకు సంబంధించి పోలీసులు 130మంది సాక్షులను ఛార్జిషీట్‌లో నమోదు చేయగా, 57మంది సాక్షులను కోర్టు విచారించింది. ఈ సాక్షుల విచారణ 2022 ఫిబ్రవరి 22వ తేదీ ప్రారంభమైంది. ఈ కేసు విచారణ మొదట నాల్గవ కోర్టులో జరగ్గా, తర్వాత 6వ అదనపు జిల్లా కోర్టులో పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. అప్పటి నుంచి అక్కడే విచారణ జరుగుతూ వచ్చింది.
జైలుకు ఆ ఐదుగురి తరలింపు
శుక్రవారం ఉదయం 10.50 గంటలకు 6వ అదనపు జిల్లా కోర్టు ఇన్‌చార్జి, 9వ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి శ్రీనివాసరావు తీర్పును ముద్దాయిలకు చదివి వినిపించారు. ఏ1 శ్రీరామచంద్రశేఖర్ అలియాస్ చింటూ, ఏ2 వెంకటాచలపతి, ఏ3 జయప్రకాష్ రెడ్డి, ఏ4 మంజునాథ్, ఏ5 వెంకటేష్ నేరం చేసినట్లు రుజువైందని, వీరిని వన్ టౌన్ పోలీసులు కస్టడీలోకి తీసుకోవాలని సీఐ మహేష్‌కు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.వీరికి సంబంధించి ఈనెల 27వ తేదిన తుది తీర్పు వెల్లడిస్తామని తెలిపారు.మిగిలిన వారిపై నేరం రుజువు కానందున కేసు కొట్టి వేయబడిందని చెప్పారు. కానీ కోర్టుకు సమర్పించిన పూచీకత్తులు ఆరు నెలల వరకు కోర్టు ఆధీనంలోనే ఉంటాయని చెప్పారు.
కోర్టు వద్ద భారీ బందోబస్తు
పోలీసులు కోర్టు వద్ద శుక్రవారం భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. న్యాయమూర్తులు కోర్టులోకి వచ్చే గేటు వద్ద.. న్యాయవాదులు, కక్షిదారులు వెళ్ళే ప్రధాన గేటు వద్ద తనిఖీలు చేపట్టారు. వాహనాలను గేటు లోపలికి అనుమతించలేదు. కోర్టు లోపలికి వచ్చే ప్రతి ఒక్కరినీ, న్యాయవాదులను సైతం ఐడీ కార్డు పరిశీలించి, మెటల్ డిటెక్టర్‌తో పరీక్షించి లోనికి అనుమతించారు.కాగా కఠారి దంపతుల కోడలు,చుడా చైర్‌పర్సన్ హేమలత కోర్టుకు వచ్చారు.ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ న్యాయస్థానం విచారణపైన తమకు పూర్తి నమ్మకం ఉందన్నారు. ఈ నెల 27వ తేదీన దోషులకు కచ్చితంగా తగిన శిక్ష పడుతుందన్న నమ్మకంతో వున్నామన్నారు..