పింఛన్ల పంపిణీలో ఫస్ట్ ప్లేస్
ABN , Publish Date - Nov 02 , 2025 | 12:43 AM
ఎన్టీఆర్ సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీలో జిల్లాకు మొదటి స్థానం దక్కింది. శనివారం రాత్రి 7.30గంటల వరకు 2,62,556మందికి గాను 2,51,100 మందికి రూ.107.76 పంపిణీ చేసినట్లు డీఆర్‌డీఏ పీడీ శోభన్‌బాబు, ఏపీడీ ప్రభావతి వెల్లడించారు.
2,51,100 మందికి రూ.107.76కోట్ల పంపిణీ
తిరుపతి(కలెక్టరేట్), నవంబరు 1(ఆంధ్రజ్యోతి): ఎన్టీఆర్ సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీలో జిల్లాకు మొదటి స్థానం దక్కింది. శనివారం రాత్రి 7.30గంటల వరకు 2,62,556మందికి గాను 2,51,100 మందికి రూ.107.76 పంపిణీ చేసినట్లు డీఆర్‌డీఏ పీడీ శోభన్‌బాబు, ఏపీడీ ప్రభావతి వెల్లడించారు. జిల్లాలోని 34 మండలాల్లో ఉదయం 7 గంటల నుంచి సచివాలయ ఉద్యోగులు ఇంటింటికీ వెళ్లి వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు పింఛన్లు పంపిణీ చేశారు. అక్టోబరు నెలకు సంబంధించి పలు మున్సిపాలిటీలు, మండలాల్లో ఉదయం 10 గంటల తర్వాత పింఛన్లు పంపిణీ చేసిన సచివాలయ ఉద్యోగులకు కలెక్టర్ షోకాజ్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఈ నెలలో సకాలంలో పంపిణీ చేశారు.