Share News

రూ.5 లక్షల టపాకాయలు సీజ్‌

ABN , Publish Date - Sep 26 , 2025 | 01:46 AM

తమిళనాడులోని శివకాశి నుంచి కొరియర్‌ ద్వారా అక్రమంగా తెప్పించిన రూ.5 లక్షల టపాకాయలను గురువారం తిరుపతి ఈస్ట్‌, అలిపిరి పోలీసులు సీజ్‌ చేశారు.

రూ.5 లక్షల టపాకాయలు సీజ్‌

తిరుపతి(నేరవిభాగం), సెప్టెంబరు 25(ఆంధ్రజ్యోతి): తమిళనాడులోని శివకాశి నుంచి కొరియర్‌ ద్వారా అక్రమంగా తెప్పించిన రూ.5 లక్షల టపాకాయలను గురువారం తిరుపతి ఈస్ట్‌, అలిపిరి పోలీసులు సీజ్‌ చేశారు. జీఎస్టీ చెల్లించకుండా రెండు నెలలుగా కొరమేనుగుంటలోని మిట్టూరు ట్రాన్స్‌పోర్టు ద్వారా 27 బాక్సులు తెప్పించారని అలిపిరి సీఐ రాంకిషోర్‌ తెలిపారు. గురువారం తిరుపతి డీఎస్పీ భక్తవత్సలంకు అందిన సమాచారం మేరకు ఈస్ట్‌, అలిపిరి సీఐలు శ్రీనివాసులు, రాంకిషోర్‌ ఆధ్వర్యంలో ఎస్‌ఐలు, సిబ్బంది దాడి చేసి సీజ్‌ చేశారు. అనుమతుల్లేకుండా.. భద్రతా ప్రమాణాలు పాటించకుండా టపాకాయలు నిల్వ ఉంచిన ఆ రవాణా కంపెనీపై కేసు నమోదు చేశారు.

Updated Date - Sep 26 , 2025 | 01:46 AM