Share News

పండుగలా గృహప్రవేశాలు

ABN , Publish Date - Nov 13 , 2025 | 12:26 AM

జిల్లావ్యాప్తంగా పండుగలా గృహ ప్రవేశాల కార్యక్రమాన్ని నిర్వహించారు.

పండుగలా గృహప్రవేశాలు
తిమ్మసముద్రంలో ఇంటి తాళాన్ని లబ్ధిదారుకు అందజేస్తున్న ఎంపీ, ఎమ్మెల్యే

చిత్తూరు, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): 2029 నాటికి ప్రతి పేదవాడికీ సొంతిల్లు ఉండాలనే ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా బుధవారం జిల్లావ్యాప్తంగా పండుగలా గృహ ప్రవేశాల కార్యక్రమాన్ని నిర్వహించారు. అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలం దేవగుడిపల్లెలో సీఎం చంద్రబాబు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా, జిల్లాలోనూ వివిధ ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.వైసీపీ హయాంలో యూనిట్‌ కాస్ట్‌ రూ.1.80 లక్షలు సరిపోక చాలామంది ఇండ్లు మంజూరైనా నిర్మించుకోలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎస్సీ, బీసీలకు రూ.50 వేలు, ఎస్టీలకు రూ.75వేలను అదనంగా కేటాయించి ప్రోత్సహించింది. ఈ 17 నెలల కాలంలో ప్రభుత్వ ప్రోత్సాహంతో జిల్లాలో 10,168 మంది ఇండ్ల నిర్మాణాలను పూర్తి చేసుకున్నారు. వీటితో పాటు కొత్తగా 5 మున్సిపాలిటీల్లో, పలమనేరు నియోజకవర్గంలో కలిపి 2472 పక్కా గృహాలను మంజూరు చేశారు.చిత్తూరు నగరం తిమ్మసముద్రం ప్రాంతంలో జరిగిన గృహప్రవేశాల కార్యక్రమంలో ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌, ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్‌, చుడా ఛైర్‌పర్సన్‌ హేమలత, మేయర్‌ అముద, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు తదితరులు పాల్గొన్నారు. రామకుప్పం మండలంలో జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌, పీకేఎం ఉడా ఛైర్మన్‌ సురేశ్‌బాబు, ఆర్టీసీ వైస్‌ ఛైర్మన్‌ మునిరత్నం, టీటీడీ బోర్డు మెంబర్‌ శాంతారాంతదితరులు హాజరయ్యారు. పూతలపట్టు మండలం పి.కొత్తకోటలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మురళీమోహన్‌, నగరిలోని చింతలపట్టెడలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్‌, హౌసింగ్‌ పీడీ సుబ్రమణ్యం పాల్గొన్నారు. రొంపిచెర్లలో హౌసింగ్‌ డీఈ యోగానంద నాయుడు, టీడీపీ ఇన్‌చార్జి చల్లా రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. ఆయా ప్రాంతాల్లో లబ్ధిదారులతో మాట్లాడి వారి వారి ఇండ్ల తాళాలను అప్పగించారు.

Updated Date - Nov 13 , 2025 | 12:27 AM