మూడో రోజుకు మహిళా ప్రయాణికుల రెట్టింపు
ABN , Publish Date - Aug 20 , 2025 | 01:10 AM
స్త్రీ శక్తి పథకం ప్రవేశపెట్టిన మూడో రోజుకే జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించిన మహిళల సంఖ్య రెట్టింపైంది. అంతకుముందు సగటును రోజుకు 35వేల నుంచి 40వేల మంది మాత్రమే ప్రయాణించేవారని ఆర్టీసీ గణాంకాలు చెబుతున్నాయి. ఉచిత ప్రయాణం విస్తృతంగా ప్రజల్లోకి చేరడంతో సోమవారం నాడు 24గంటల్లో జిల్లా వ్యాప్తంగా మహిళలు 81,350మంది, బాలికలు 915మంది రాకపోకలు సాగించారు. దీంతో మూడో రోజునే రెట్టింపు సంఖ్యలో ఆర్టీసీ ఉచిత ప్రయాణాన్ని సద్వినియోగం చేసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోనే అధికసంఖ్యలో మహిళలు స్త్రీ శక్తి పథకం సద్వినియోగం చేసుకున్న జిల్లాలలో తిరుపతికి పదో స్థానం దక్కింది. ఇతర జిల్లాలతో పోలిస్తే ఈ పథకం వర్తించని బస్సులు ఇక్కడే అధికం.
తిరుపతి(ఆర్టీసీ), ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి): స్త్రీ శక్తి పథకం ప్రవేశపెట్టిన మూడో రోజుకే జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించిన మహిళల సంఖ్య రెట్టింపైంది. అంతకుముందు సగటును రోజుకు 35వేల నుంచి 40వేల మంది మాత్రమే ప్రయాణించేవారని ఆర్టీసీ గణాంకాలు చెబుతున్నాయి. ఉచిత ప్రయాణం విస్తృతంగా ప్రజల్లోకి చేరడంతో సోమవారం నాడు 24గంటల్లో జిల్లా వ్యాప్తంగా మహిళలు 81,350మంది, బాలికలు 915మంది రాకపోకలు సాగించారు. దీంతో మూడో రోజునే రెట్టింపు సంఖ్యలో ఆర్టీసీ ఉచిత ప్రయాణాన్ని సద్వినియోగం చేసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోనే అధికసంఖ్యలో మహిళలు స్త్రీ శక్తి పథకం సద్వినియోగం చేసుకున్న జిల్లాలలో తిరుపతికి పదో స్థానం దక్కింది. ఇతర జిల్లాలతో పోలిస్తే ఈ పథకం వర్తించని బస్సులు ఇక్కడే అధికం.