Share News

జీఎస్టీ తగ్గింపుతో రైతుకు మరింత లాభం

ABN , Publish Date - Oct 02 , 2025 | 01:36 AM

కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గించడం ద్వారా రైతులకు మరింత ప్రయోజనం కలుగుతుందని ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు అన్నారు.

జీఎస్టీ తగ్గింపుతో రైతుకు మరింత లాభం
స్టాళ్లను పరిశీలిస్తున్న ఎంపీ, కలెక్టర్‌, జేసీ, ఎమ్మెల్యేలు, తదితరులు

చిత్తూరు సెంట్రల్‌, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గించడం ద్వారా రైతులకు మరింత ప్రయోజనం కలుగుతుందని ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు అన్నారు.బుధవారం కలెక్టరేట్‌లోని గ్రీవెన్స్‌ సెల్‌ మందిరంలో వ్యవసాయ, అనుబంధ శాఖల ఆధ్వర్యంలో జీఎస్టీ సూపర్‌ సేవింగ్‌ ద్వారా వ్యవసాయ రంగంలో కలిగే ప్రయోజనాలపై రైతాంగానికి అవగాహన కార్యక్రమం కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ జీఎస్టీ తగ్గింపుతో వ్యవసాయ పనిముట్లు, ట్రాక్టర్లు తదితరాల ధరలు తగ్గుతాయన్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ జీఎస్టీ తగ్గింపును రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఎమ్మెల్యేలు జగన్మోహన్‌,మురళీమోహన్‌ మాట్లాడుతూ జీఎస్టీ తగ్గింపు అన్ని వర్గాలవారికీ ఊరట ఇచ్చిందన్నారు.వ్యవసాయ, ఉద్యాన, మత్స్య, పట్టు , పశుసంవర్థక శాఖలతో పాటు, ఏపీఎంఐపీ ఇతర అనుబంధ విభాగాలు కలెక్టరేట్‌ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పనిముట్లు, పరికరాల ప్రదర్శనను వారంతా సందర్శించారు.జేసీ విద్యాధరి,మేయర్‌ అముద, చుడా ఛైర్‌పర్సన్‌ కటారి హేమలత, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, వ్యవసాయ, పశుసంవర్థక,పట్టు పరిశ్రమ శాఖల జేడీలు మురళీకృష్ణ, ఉమామహేశ్వరి, పద్మావతి, మత్స్య శాఖ ఏడీ రవికుమార్‌, ఉద్యానశాఖ డీడీ మధుసూదన రెడ్డి, ఏపీఎంఐపీ పీడీ రమణ, కమర్షియల్‌ ట్యాక్స్‌ జాయింట్‌ కమిషనర్‌ రఘునాథరెడ్డి, పలు కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - Oct 02 , 2025 | 01:36 AM