Share News

రైతన్నా.. మీకోసం

ABN , Publish Date - Nov 25 , 2025 | 02:30 AM

రైతన్నా.. మీకోసం’ కార్యక్రమంలో భాగంగా సోమవారం రేణిగుంట మండలం గాజులమండ్యంలో కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ పాల్గొన్నారు. గ్రామంలోని ప్రతి రైతు ఇంటికి వెళ్లి ప్రభుత్వ పథకాలను వివరించారు. రైతు సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం గత ఒకటిన్నర సంవత్సరంలో పలు పథకాలు అమలు చేసిందని గుర్తుచేశారు. ప్రతి పథకం రైతు ఇంటి వద్దకు చేరేలా ఈనెల 29వ తేదీ వరకు గ్రామ సచివాలయ సిబ్బంది అవగాహన కల్పిస్తారన్నారు. జిల్లాలో 20 వేల టన్నుల యూరియా అందుబాటులో ఉండగా, ఇప్పటివరకు 12,500 టన్నులు పంపిణీ చేశామన్నారు. కనీసం మద్దతు ధర కంటే తక్కువకే ధాన్యం విక్రయించాల్సిన పరిస్థితి రాకుండా ప్రతి గింజను ప్రభుత్వమే కొంటుందన్నారు. ఈ ఏడాది వర్షాలు బాగా కురిసినందున రెండు పంటలు వేసుకునే అవకాశం ఉందన్నారు. కూలీల కోరతను తగ్గించేందుకు సీహెచ్‌సీల ద్వారా తక్కువ ఖర్చుతో యంత్రాలను అందుబాటులోకి తెచ్చామన్నారు. డ్రోన్‌ సాయంతో ఎకరాకు 6 నిమిషాల్లో ఎరువుల పిచికారీ పూర్తి చేయవచ్చన్నారు. మామిడి, వేరుశనగ పంటలకు డ్రిప్‌, స్ర్పింక్లర్లును రాయితీపై అందిస్తున్నామన్నారు. ఏ పంట వేసేదీ ప్రతి రైతు ఫార్మర్‌ రిజిస్టర్లో నమోదు చేసి పంట బుకింగ్‌ వ్యవస్థను బలోపేతం చేశామన్నారు. ఆర్డీవోలు భానుప్రకా్‌షరెడ్డి, ప్రసాదరావు, ఏవో సునీల్‌కుమార్‌రెడ్డి, తహసీల్దార్‌ చంద్రశేఖర్‌ రెడ్డి, రెవెన్యూ, మత్స్య శాఖ, సిబ్బంది, స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

రైతన్నా.. మీకోసం
గాజులమండ్యంలో రైతులతో మాట్లాడుతున్న కలెక్టర్‌

  • ఇంటింటికీ వెళ్లి పథకాలను వివరించిన కలెక్టర్‌

రేణిగుంట, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): ‘రైతన్నా.. మీకోసం’ కార్యక్రమంలో భాగంగా సోమవారం రేణిగుంట మండలం గాజులమండ్యంలో కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ పాల్గొన్నారు. గ్రామంలోని ప్రతి రైతు ఇంటికి వెళ్లి ప్రభుత్వ పథకాలను వివరించారు. రైతు సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం గత ఒకటిన్నర సంవత్సరంలో పలు పథకాలు అమలు చేసిందని గుర్తుచేశారు. ప్రతి పథకం రైతు ఇంటి వద్దకు చేరేలా ఈనెల 29వ తేదీ వరకు గ్రామ సచివాలయ సిబ్బంది అవగాహన కల్పిస్తారన్నారు. జిల్లాలో 20 వేల టన్నుల యూరియా అందుబాటులో ఉండగా, ఇప్పటివరకు 12,500 టన్నులు పంపిణీ చేశామన్నారు. కనీసం మద్దతు ధర కంటే తక్కువకే ధాన్యం విక్రయించాల్సిన పరిస్థితి రాకుండా ప్రతి గింజను ప్రభుత్వమే కొంటుందన్నారు. ఈ ఏడాది వర్షాలు బాగా కురిసినందున రెండు పంటలు వేసుకునే అవకాశం ఉందన్నారు. కూలీల కోరతను తగ్గించేందుకు సీహెచ్‌సీల ద్వారా తక్కువ ఖర్చుతో యంత్రాలను అందుబాటులోకి తెచ్చామన్నారు. డ్రోన్‌ సాయంతో ఎకరాకు 6 నిమిషాల్లో ఎరువుల పిచికారీ పూర్తి చేయవచ్చన్నారు. మామిడి, వేరుశనగ పంటలకు డ్రిప్‌, స్ర్పింక్లర్లును రాయితీపై అందిస్తున్నామన్నారు. ఏ పంట వేసేదీ ప్రతి రైతు ఫార్మర్‌ రిజిస్టర్లో నమోదు చేసి పంట బుకింగ్‌ వ్యవస్థను బలోపేతం చేశామన్నారు. ఆర్డీవోలు భానుప్రకా్‌షరెడ్డి, ప్రసాదరావు, ఏవో సునీల్‌కుమార్‌రెడ్డి, తహసీల్దార్‌ చంద్రశేఖర్‌ రెడ్డి, రెవెన్యూ, మత్స్య శాఖ, సిబ్బంది, స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Nov 25 , 2025 | 02:30 AM